హిమోఫిలియా బాధితులు ఆత్మస్థైర్యం కోల్పోరాదు

  1. హిమోఫిలియా బాధితులు ఆత్మస్థైర్యం కోల్పోరాదు……
  2. ట్రైని కలెక్టర్ వినూత్న ఓదార్పు…..

అనంతపురం ముచ్చట్లు

Date :09/06/2024

 

హిమోఫిలియా( రక్తస్రావం ) బాధితులు తమ ఆత్మ స్థాయిరాన్ని కోల్పోరాదని జిల్లా ట్రయిని కలెక్టర్ వినూత్న ఓదార్చారు. ఆదివారం పట్టణంలో హిమోఫిలియా పై బాధితులు వారి కుటుంబ సభ్యులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ట్రయిని కలెక్టర్ వినూత్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిమోఫిలియా అంటే నిరంతర రక్తస్రావం గడ్డలు కట్టడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ వ్యాధి పట్ల భయాందోళన చెందుతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రక్తశ్రావం సమయంలో బాధితులు వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండి చికిత్సలు అందించాలన్నారు ఎంతటి క్రిష్టమైన సమస్యనైనా మనోధైర్యంతో ఎదుర్కొంటే వాటికి పరిష్కారం లభిస్తుందని ఆమె తెలిపారు బాధితుల కండగా ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లుజెసి వినూత్న తెలిపారు.ఈ సదస్సులో డాక్టర్ హేమలత మాట్లాడుతూ హిమోఫిలియా బాధితులకు ప్రభుత్వాసుపత్రిలో ఎమర్జెన్సీ వైద్యం అందిస్తున్నట్లుతెలిపారు.

బాధితులకు ఎప్పటికప్పుడు ఫ్యాక్టర్ ఇంజక్షన్లు అందిస్తామన్నారు బాధితులు ఎప్పుడైనా వైద్య సేవలు పొందవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో ఇటాస్ ప్రతినిధులు రామకృష్ణ, నారాయణస్వామి శ్యాంసుందర్. కృష్ణమూర్తి గణేషు చిక్కన్న తో పాటు అధిక సంఖ్యలో హిమోఫిలియా బాధితులు వారి కుటుంబ సభ్యులు, హిమోఫిలియా సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: Sufferers of hemophilia should not lose SelfConfidence.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *