భానుడి భగభగలకు ఉక్కిరిబిక్కిరి

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రకోపం కొనసాగుతోంది. రోహిణికార్తే ప్రవేశంతో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఉక్కపోత, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.45 నుంచి 47 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే చాలు.. ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. భానుడు ప్రకోపానికి జడిసి జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వృద్ధులు, పిల్లలైతే ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసరంగా బయటికెళ్లాలనుకున్న భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న కారణంతో ఇళ్లు విడిచి బయటికి అడుగుపెట్టేందుకు ఆచితూచి అడుగు వేయాల్సిన అనిశ్చిత స్థితి నెలకొంది. మరో రెండు వారాల పాటు ఎండ, వడగాల్పుల తీవ్రత అధికంగానే ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. దీంతో నిత్యం జనరద్దీతో ఉండే హైదరాబాద్‌లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరి బయటకు వచ్చిన జనం మాత్రం అడుగడుగునా శీతల పానీయాలు సేవిస్తూ తమ పనులు ముగించుకుని తిరిగి ఇంటి బాట పట్టే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటున్న దృష్టా ఆ సమయంలో బయట తిరగొద్దని వాతావరణ శాఖ అధికారులు సైతం సూచిస్తున్నారు.

 

 

 

 

ప్రధానంగా పిల్లలు, వృద్ధులు, మహిళలపై ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. అత్యవసరమై బయటికి వెళ్లాల్సి వస్తే మాత్రం సరైన జాగ్రత్తలతో ఇళ్లనుంచి బయటకు కదలాల్సి ఉంది. ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వస్తే ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు గొడుగును తీసుకెళ్లడం శ్రేయస్కరమని చెబుతున్నారు. అంతేకాదు.. నిమ్మరసం, గ్లూకోజు నీళ్లు, మజ్జిగ వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. సూర్యుడి భగభగకు అల్లాడుతున్న జనం నైరుతీ రుతుపవనాల రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 8 నాటికి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భావించినప్పటికీ వాటి రాక సైతం మరో ఐదు రోజులు ఆలస్యం కానున్నాయి. హైదరాబాద్‌లో 43. కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 47 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

 

 

 

 

ఆదిలాబాద్ 45.1, కుమురం భీం 42.7, మంచిర్యాల 42.4, నిర్మల్ 45.4, నిజామాబాద్ 44.8, జగిత్యాల 44.5, పెద్దపల్లి 42.4, జయశంకర్ భూపాలపల్లి 41.8, భద్రాద్రి కొత్తగూడెం 40.5. మహబూబాబాద్ 41.4, వరంగల్ రూరల్ 42.6, వరంగల్ అర్బన్ 41.8, కరీంనగర్ 43.4, రాజన్న సిరిసిల్ల  43.7, కామారెడ్డి  43.8, మెదక్ 42.5, సిద్ధిపేట్ 42.9, జనగాం 41.0, యాదాద్రి భువనగిరి 42.5, మేడ్చల్ మల్కాజ్‌గిరి 42.2, హైదరాబాద్ 42.7, రంగారెడ్డి 42.3, వికారాబాద్ 41.1, మహబూబ్ నగర్ 41.5, జోగలాంబ గద్వాల 39.9, వనపర్తి 40.0, నాగర్ కర్నూల్ 42.1, నల్గొండ 42.5, సూర్యాపేట 41.7, ఖమ్మం 41.5, ములుగు 40.9. నారాయణపేట 42.1గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.భానుడి భగభగలకు ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఇది చల్లటి కబురే. ఈ నెల 29,30 తేదీల్లో ఉత్తర భారతంలో ధూళీ, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమంలో కలిగే మార్పుల వల్ల ఆయా తేదీల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని.

 

 

 

అదే సమయంలో ఈదురుగాలులు గంటకు 5060 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ విభాగానికి చెందిన కుల్దీప్ శ్రీవాత్సవ్ తెలిపారు. ఇది ప్రజలకు తీవ్ర ఉపశమనం కలిగిస్తుందన్నారు. వేడిగాలులతో రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు అల్లల్లాడుతున్నాయి. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనమంతా అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ఉత్తర భారత్‌లో వాతావరణ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది.మరోవైపు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్‌లతో పాటు తెలుగు రాష్ట్రాలు (తెలంగాణ, ఎపి)లో రానున్న మూడు రోజుల పాటు వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచించింది.

 

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Suffocated to Bhanu’s bhagabhaga

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *