వైభవంగా ప్రారంభమైన సుగుటూరు గంగమ్మ జాతర- పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి దంపతులు
-15న భక్తులకు అనుమతి
పుంగనూరు ముచ్చట్లు:

జమీందారుల కుల దైవమైన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం రాత్రి తొలిరోజు వైభవంగా ప్రారంభమైంది. తొలుత ప్యాలెస్‌లో అమ్మవారికి జమీందారులు మల్లికార్జునరాయల్, సోమశేఖర్ చిక్కరాయల్ ,వారి కుటుంబ సభ్యులు తొలి పూజలు నిర్వహించారు.మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ కలసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమీందారులను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే వర్తక వ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. కాగా రాత్రి పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. బుధవారం వేకువజామున అమ్మవారిని ప్యాలెస్ ఆవరణంలోని ఆలయంలో ఉంచి ప్రజల దర్శనానికి అనుమతిస్తారు. అదే రోజు రాత్రి ఊరేగించి నిమజ్జనం చేస్తారు. ఈ పూజా కార్యక్రమాలలో జెడ్పిచైర్మన్ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, చైర్మన్ అలీమ్‌బాషా, కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం,పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, రెడ్డెప్ప, డీసీసీబి చైర్మన్ రెడ్డెమ్మ, తదితరులు పాల్గొన్నారు.
జాతర ప్రారంభం….
శ్రీ సుగుటూరు గంగమ్మను అత్యంత సుందరంగా ఏర్పాటు చేసిన పల్లకిలో ఉంచి పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపులో వందలాది జంతుబలులు సమర్పించి, ప్రజలు వెహోక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి నెయ్యి దీపాలు, పెరుగన్నం పెట్టి వెహోక్కులు చెల్లించారు.
భారీ బందోబస్తు….
పట్టణంలో సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటలు చోటు చేసుకోకుండ జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. అమ్మవారి ఊరేగింపులో ఎలాంటి ఇబ్బందులు జరగకుండ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయాలని డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పట్టణ సీఐలు మధుసూధన్‌రెడ్డి, గంగిరెడ్డి, అశోక్‌కుమార్ పర్యవేక్షణలో సుమారు 300 మంది పోలీసులతో జాతరకు పటి ష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పిట్‌ఫ్యాకెట్లు, చైన్స్స్నాచింగ్‌లు జరగకుండ ఐడి పార్టీ బృందాలను నిఘా పెట్టారు.
Tags; Suguturu Gangamma Jatara started with grandeur – Minister Peddireddy’s couple presented silk clothes
