వడ్డీవ్యాపారుల వేదింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Suicidal attempts by a businessman are a suicide attempt

Suicidal attempts by a businessman are a suicide attempt

Date:10/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

అప్పులు చేసి కొనుగోలు చేసిన భూమిని అమ్మకందారు రాసిఇవ్వకపోవడం, వడ్డీ వ్యాపారుల వేదింపులు తీవ్రంకావడంతో మనస్థాపానికి గురైన వ్యక్తి ప్లోరైడ్‌ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన పుంగనూరు మండలం బాలగురవయ్యగారిపల్లెలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వెంకటరెడ్డి చౌడేపల్లె మండలం అంకుతోటపల్లె వద్ద భూమిని బాలరాజు అనే వ్యక్తి వద్ద మూడు సంవత్సరాలకు ముందు 3.75 ఎకరాల భూమిని రూ.9.85 లక్షలకు కొనుగోలు చేశాడు. ఈ మేరకు బాలరాజుకు ఆయన కుమారుడు కిషోర్‌కు రూ.8.58 లక్షలు బ్యాంకుల ద్వారా జమ చేశాడు. ఈ భూమిని రిజిస్ట్రర్‌ చేసి ఇవ్వమని పలుమార్లు బాలరాజును కోరిన పట్టించుకోకపోవడంతో చౌడేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చర్యలు తీసుకోకపోవడం, వడ్డీవ్యాపారుల వేదింపులు తీవ్రం కావడంతో మనస్థాపానికి గురై, భూమి తనకు రాదని , అప్పులు తీర్చలేనని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖరాసి ప్లోరైడ్‌ మందు తాగాడు. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే బాదితుడు వెంకటరెడ్డిని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భరతమాత ముద్దు బిడ్డ రవీంద్రనాథ్‌రెడ్డి

Tags: Suicidal attempts by a businessman are a suicide attempt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *