యువకుడి ఆత్మహత్యాయత్నం

విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ గోపాలపట్నం వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. గాయంతో స్థానిక లక్ష్మీనగర్ ప్రధాన రహదారి పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.లక్ష్మీనగర్ ప్రధాన రహదారిలో విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి చేతిపై తెగిన గాయంతో పడిఉన్నాడు. స్థానికులు అతని వద్దకు వెళ్లి పరిశీలిస్తే జేబులో సూసైడ్ నోట్ దొరికింది. తన భార్య లలితను క్షమించమని కోరుతూ ఆ లేఖలో రాశాడు. తాను చనిపోతు న్నానని, తనను క్షమించాలని కోరాడు. అదే విధంగా తాను చనిపోయిన తరువాత మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆ ఉత్తరంలో రాశాడు.  స్థానికులు 108కు సమాచారం అందజేసి ఆ వ్యక్తిని కేజీహెచ్కి తరలించారు.

మహేష్‌బాబు భావోద్వేగం

 

Tags:Suicide attempt by a young man

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *