రైతుల భూములు లాక్కున్నారంటూ సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ఆత్మహత్యా యత్నం

నల్గొండ  ముచ్చట్లు:
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని పేదలకు చెందిన భూదాన్, అసైన్మెంట్ భూములను కీర్తి సిమెంట్ యాజమాన్యం కబ్జా చేస్తూ  రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు.పరిశ్రమ గేటు ఎదుట బైటాయించిన రైతులకు, బిజెపి నాయకులు మద్దతు పలికారు.ఎడ్లబండితో పరిశ్రమకు గేటు ముందు రైతులు నిరసన కు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉద్యోగస్తులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న బాధితులను పోలీసులు నచ్చజెపుతున్నారు.పోలీసులకు,రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగి  ఆత్మహత్యాయత్నం చేశారు.మాజీ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి  భూదాన్, అసైండ్ భూముల బాధితులకు అండగా    పోలీసులతో వాగ్వాదానికి దిగారు..

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Suicide attempt in front of cement factory as farmers’ lands were confiscated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *