Natyam ad

సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు-జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్

సమస్యలుంటే ప్రభుత్వం,పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలి

కడప ముచ్చట్లు:

 

సమస్య ఉంటే దాని పరిష్కారం కూడా వెన్నంటే ఉంటుందని, ధైర్యం కోల్పోకూడదని జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్  పేర్కొన్నారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, ఎవరికైనా ఎలాంటి
సమస్యలున్నా ప్రభుత్వం, పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని హితవు పలికారు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి భరోసాఇచ్చారు. ఆదివారం జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్  ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్ధిక, ఇతరత్రా సమస్యలు, ఇబ్బందులున్నాయని వాటిని ఎదుర్కోలేక క్షణికావేశంలో అర్ధాంతరంగాతనువు చాలిస్తే కుటుంబాలు చిన్నాభిన్నమై భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందనే విషయం గ్రహించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య ఆలోచన దరిచేరనివ్వవద్దని ఎస్.పి విజ్ఞప్తి చేశారు.ఎవరికైనా ఎలాంటి సమస్యలు లేదా ఇబ్బందులున్నా తన ఫోన్ నెంబర్ 9440796900 కు ఫోన్ చేయాలని, వెంటనే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఎస్.పి  కే.కే.ఎన్అన్బురాజన్ హామీ ఇచ్చారు.

 

Post Midle

Tags: Suicide is not a solution to problems – District SP KKN Anburajan

Post Midle

Leave A Reply

Your email address will not be published.