Natyam ad

వృద్ధ దంపతుల ఆత్మ హత్య-రఘురాములకోటలో విషాదం

జగిత్యాల ముచ్చట్లు:

జగిత్యాల రూరల్ మండలం రఘురాములాకోట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదం నింపింది.సింహరాజు మునిందర్ (75), ఆయన భార్య సులొచన(70) అనే వృద్ద దంపతులు సోమవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపారు. ఆత్మహత్య
విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు.దంపతుల ఆత్మ హత్యకుఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్  పోలీసులు తెలిపారు.

 

Tags:Suicide of an elderly couple – Tragedy at Raghuramulakota

Post Midle