ప్రేమికుల ఆత్మహత్య

వరంగల్ ముచ్చట్లు:

పురుగుల మందు తాగి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లంపల్లి గ్రామ శివారు బిక్యా నాయక్ తండాకు చెందిన గుగులోతు రాజు , బానోతు దీపిక గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో పురుగుల మందు తాగి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే రాజు మాయ మాటలు చెప్పి దీపిక ఆత్మ హత్యకు చేసుకునేందుకు కారణమయ్యాడని ఆరోపిస్తూ దీపిక కుటుంబ సభ్యులు రాజు ఇంటి ముందు దీపిక మృతదేహాన్ని పూడ్చి పెట్టేందుకు గోయ్యి తీసే ప్రయత్నం చేస్తున్నారు. దింతో తండాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags; suicide of lovers

Leave A Reply

Your email address will not be published.