పోలీసులు తప్పుడు కేసుపెట్టారని ఆత్మహత్య

సామర్లకోట ముచ్చట్లు:
 
మునిసిపల్ ఎన్నికల్లో తనపై ఇండిపెండెంట్ గా పోటీచేసాడనే అక్కసుతో అధికార పార్టీకి చెందిన ఓ నేత ఆ దళిత కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆ కుటుంబంలోని యువకుడిపై కేసు పెట్టించి పోలీసులతో కొట్టించి చివరకు ఆ యువకుడు ఆత్మహత్య చేసుకునేలా చేసిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో చోటుచేసుకుంది. దింతో కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు మృతదేహన్నీ స్టేషన్లో ఉంచి ఆందోళన చేపట్టారు.సామర్లకోట పట్టణంలోని 13వ వార్డుకు చెందిన అలపు ప్రవీణ్ కుమార్  గత మునిసిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. నామినేషన్ వేసినప్పటి నుంచి అధికార వైసీపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురైనప్పటికి పోటీలో నిలుచున్నారు. దింతో ప్రవీణ్ పై అక్కసు పెంచుకున్న సదరు వైసీపీ నేత ఈనెల 1వ తేదీ రాత్రి 9గంటలకు ప్రవీణ్ తమ్ముడు గిరికి 7వ సచ్చివాలయం వాలంటీర్ కు జరిగిన  గోడవను అడ్డంపెట్టుకుని గిరితో పాటు మరో యువకుడిపై 2వ తేదీన వాలంటీర్ పై దౌర్జన్యం చేసినట్లుగా కేసు పెట్టించి పోలీసులతో కొట్టించడంతో ఆ అవమానం భరించలేక ఈరోజు గిరి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. గిరి మృతి ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు భాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
 
ఈ సందర్భంగా స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న ఎఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు బాధితులతో చర్చలు జరిపి గిరి ఆత్మహత్యకు కారణమైన వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. 1వతేది రాత్రి జరిగిన గొడవలో తమపై పెట్టిన కేసులో స్టేషన్ కు వచ్చామని ఎసై తమను కొట్టారని ఆ అవమానం భరించలేకే గిరి ఆత్మహత్య చేసుకున్నాడని గిరి స్నేహితుడు భానుప్రసాద్ స్నేహితుడు కన్నీటి పర్యంతం అయ్యాడు. తనపై కక్షతోనే వైసీపీ నేత గిరిపై తప్పుడు కేసు పెట్టించాడని మృతుని అన్నయ్య ప్రవీణ్ వాపోయారు. సామర్లకోట వైసీపీ నేతలు, పోలీసుల వల్లే గిరి చనిపోయాడని భాద్యులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని దళిత నేత లింగం శివప్రసాద్ డిమాండ్ చేశారు. జిల్లా  ఎస్పీ ఆదేశాల మేరకు ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు పై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాద్యులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని ఎఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Suicide that police falsely accused

Natyam ad