Natyam ad

మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించే అర్హత సూట్‌కేస్‌ బాబుకు లేదు

– దేశం ఇన్‌చార్జ్పై వైఎస్సార్‌సిపి నేతల ఆగ్రహం
 
పుంగనూరు ముచ్చట్లు:
 
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని , వైఎస్సార్‌సిపి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత సూట్‌కేసులు తీసుకె ళ్లే పుంగనూరు నియోజకవర్గ దేశం ఇన్‌చార్జ్ చల్లాబాబు లేదని….స్థాయి మించి మాట్లాడితే తగిన శాస్తి చేస్తాం జాగ్రత్త అంటు ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి హెచ్చరించారు. శనివారం మండలంలోని కంటేపల్లె గ్రామంలో వివాదస్పదంలో ఉన్న క్వారీ ప్రాంతాన్ని గ్రామస్తులతో కలసి పరిశీలించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వరి కుప్పలు తగులబెట్టి నెలరోజుకావస్తోందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి స్పందించి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం ఇన్‌చార్జ్ బాబు మత్తు నుంచి బయటపడి , కంటేపల్లెలో పర్యటించి, విమర్శించడం అవి వివేకమన్నారు. చోట నాయకుల నుంచి చంద్రబాబు వరకు మంత్రి రామచంద్రారెడ్డి జపం చేస్తున్నారని…. రామజపం చేస్తూ తరిస్తున్నారని ఎద్దెవా చేశారు. వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలను కాదని 6 హెక్టార్ల క్వారీలైసెన్సు మంజూరు చేశారని తెలిపారు. ప్రజలపై నేడు తెలుగుదేశం నాయకులకు ఎనలేని ప్రేమ ఎలా వచ్చిందన్నారు. ప్రభుత్వం రాగానే పనులను ఆపివేసి, ప్రజలకు అండగా నిలిచామన్నారు. అసత్య ఆరోపణలతో గ్రామాలకు వస్తే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వరి కుప్పలు కాల్చిన వారిపై కేసులు పెట్టారని , తెలుగుదేశం వారు గ్రామానికి వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైస్‌ ఎంపిపి ఈశ్వరమ్మ, కౌన్సిలర్‌ నరసింహ యాదవ్‌, వైఎస్సార్‌సిపి నాయకులు జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, పాపిరెడ్డి, రెడ్డెప్ప, సుబ్రమణ్యం, రమణ తదితరులు పాల్గొన్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Suitcase Babu has no right to criticize Minister Peddireddy