చంద్రబాబు కోసం సుజనా చౌదరి..?

విజయవాడ ముచ్చట్లు:


ఏపీ బీజేపీలో కొందరు నేతలు..చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఎప్పటినుంచో విమర్శలు వస్తూనే ఉన్నాయి. బీజేపీలో కొందరు నేతలు జగన్‌కు అనుకూలంగా మరికొందరు బాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. ప్రచారానికి తగ్గట్టుగానే కొందరు నేతలు అలాగే రాజకీయం చేసేవారు. ఇక్కడ జగన్‌కు అనుకూలంగా పనిచేసే నేతలని పక్కన పెడితే..బీజేపీలో బాబుకు అనుకూలంగా పనిచేసే నేతలు బాగానే ఉన్నారు.ఆ నేతలు జగన్‌పై ఎప్పుడు ఫైర్ అవుతూనే ఉంటారు. అలాగే 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత టీడీపీ నుంచి కొందరు నేతలు బీజేపీలోకి వెళ్లారు. వారే బాబుని కాపాడుతూ వస్తున్నారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా సుజనా చౌదరీ, సీఎం రమేశ్, కామినేని శ్రీనివాస్ లాంటి నేతల పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. వీరు మళ్ళీ బాబుని బీజేపీకి దగ్గర చేసే కార్యక్రమాలు చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తూనే ఉంది. అలాగే బాబుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీరే కాపాడుతున్నారని ప్రచారం ఉంది.

 

 

అయితే విమర్శలే కాదు..నిజంగానే బాబు కోసం కొందరు బీజేపీ నేతలు పనిచేస్తున్నారని అర్ధమవుతుంది.ఇక వారి కర్తవ్యం ఒకటే..ఎలాగైనా జగన్‌ని గద్దె దించి…చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడం. ముఖ్యంగా సుజనా చౌదరీ ఈ విషయంలో గట్టిగా కష్టపడుతున్నారని తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటికీ తాను బాబు శ్రేయభిలాషినే అని, బాబు తన రాజకీయ గురువు అని చెప్పారు.అలాగే ఏపీలో జగన్‌కు చెక్ పెట్టడమే తన లక్ష్యమన్నట్లు సుజనా మాట్లాడుతున్నారు. ఈ సారి జగన్‌ అధికారంలోకి వచ్చేలా ప్రజలు మళ్ళీ తప్పు చేయకుండా చూసుకోవాలని అంటున్నారు. అంటే సుజనా టార్గెట్ ఒకటే..జగన్‌ని ఎలాగైనా గద్దె దింపేయాలనేది. అలాగే తన రాజకీయ గురువుని అధికారంలోకి తీసుకురావాలనే ధ్యేయంతోనే పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. బీజేపీని వేదికగా చేసుకుని సుజనా..బాబు కోసం కష్టపడుతున్నారు.

 

Tags: Sujana Chaudhary for Chandrababu?

Leave A Reply

Your email address will not be published.