Natyam ad

ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై సుఖేశ్‌‌ ఆరోపణలు

–    మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేశ్‌‌ చంద్రశేఖర్ నేడు మరో లేఖను విడుదల
త్వరలోనే కేజ్రీ వాల్‌కు సంబంధించి మరో కుంభకోణాన్ని బయట పెడతా
వాస్తవాలు బయటపెడుతున్నందుకే తనను మానసికంగా వేధిస్తున్నారు

న్యూఢిల్లీ  ముచ్చట్లు:


మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేశ్‌‌ చంద్రశేఖర్ నేడు మరో లేఖను విడుదల చేశారు. ఈసారి ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై సైతం ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఇంటి నిర్మాణంపై సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి ఆరోపణలు చేశారు. ఆ ఇంటి ఫర్నిచర్‌కి అయిన ఖర్చులను తానే భరించానన్నారు. అందుకు సంబంధించిన బిల్లులున్నాయని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత షెల్ కంపెనీల అకౌంట్స్ నుంచి మారిషస్ లోని కైలాష్ గెహ్లాట్ బంధువుల అకౌంట్లకు నగదు బదిలీ అయ్యిందని తెలిపారు. 25+25+30 కోట్ల నగదు బదిలీలు జరిగాయన్నారు.ఇందుకు సంబంధించి కేజ్రీవాల్ ఫేస్ టైం చాట్స్ వివరాలను కూడా త్వరలోనే విడుదల చేస్తానని సుఖేశ్ చంద్రశేఖర్ తెలిపారు. వాస్తవాలు బయటపెడుతున్నందుకే తనను మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. తనకు అనుకూలమైన జైలు అధికారుల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయంపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశానన్నారు. త్వరలోనే కేజ్రీ వాల్‌కు సంబంధించి మరో కుంభకోణాన్ని బయట పెడతానని సుఖేశ్ చంద్రశేఖర్ వెల్లడించారు.

 

Post Midle

Tags: Sukesh’s allegations against Delhi Chief Minister Kejriwal along with MLC Kavita

Post Midle