అరకులోయ మండల వైస్ ఎంపిపి గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుమాంజలి
విశాఖపట్నం ముచ్చట్లు:
అరకువేలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు జరిగిన రెండవ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష వైస్ ఎంపిపి ఎన్నికలలో అరకువేలి, మండలానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు మొత్తం పదమూడు మంది పాల్గొని ఏక పక్షంగా ఏకగ్రీవంగా వైస్ ఎంపిపి మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా కొర్ర సుమాంజలి ఎన్నుకోన్నారు మండల అధ్యక్షులు కొర్రా గాసి చేసినటువంటి పార్టీ సేవలను అధిష్టానం గుర్తించి నిరంతరం శ్రమిస్తూ ప్రజల కొరకు పాటుపడే వారికి మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి అతని కుమార్తె అయిన సుమాంజలి కి కట్ట బెట్టడం సంబంధిత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులందరికీ అరకువేలి మండల వాసులు అందరూ హర్షిస్తున్నారు. ఏకగ్రీవంగా మండల పరిషత్ ఉపాధ్యక్షురాలి గా ఎన్నికైన కొర్ర సుమాంజలి కి మండల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు ,డైరెక్టర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. తదితరులు అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Sumanjali was unanimously elected as the Vice MP of Araku Valley Mandal