నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సుమిత్‌ కుమార్‌.

చిత్తూరు ముచ్చట్లు:

ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత: నూతన జిల్లా కలెక్టర్.సోమవారం ఉదయం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా నియామకం కాబడ్డ సుమిత్‌ కుమార్‌ గారు పదవీ బాధ్యతలు స్వీకరించారు.కలెక్టరేట్ కి చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ గారికి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వేద పండితులు మంత్రోచ్ఛారణ లతో స్వాగతం పలకగా,డి ఆర్ ఓ బి.పుల్లయ్య,డ్వామా పిడి ఎన్.రాజశేఖర్, కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వర్లు,కాణిపాకం ఈఓ వెంకటేశు, రెవెన్యూ అసోసియేషన్ కలెక్టరేట్ యూనిట్ ప్రెసిడెంట్ పార్థసారథి,ఇతర సంబంధిత అధికారులు స్వాగతం పలికారు.అనంతరం కలెక్టర్ ఛాంబర్ నందు చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ విధులు నిర్వర్తించడం జరిగిందని, ప్రజాసమస్యలపరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. త్రాగునీరు,భూ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగు తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేస్తామనన్నారు.ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.

 

 

 

Tags:Sumit Kumar who took charge as the new collector

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *