గోవాలో సమ్మూ బర్త్ డే సెలబ్రేషన్స్

Summember celebrations in Goa
Date:23/11/2018
పానాజీ ముచ్చట్లు:
అక్కినేని నాగార్జున నటవారసుడు అక్కినేని నాగాచైతన్య పుట్టినరోజు నేడు. తన పుట్టినరోజు వేడుకలను భార్య సమంతతో కలిసి నాగచైతన్య గోవాలో జరుపుకోనున్నారు. ఇప్పటికే కొంత మంది స్నేహితులతో కలిసి వీరిద్దరూ గోవాకు వెళ్లిపోయారు. వాస్తవానికి ఈ అక్కినేని జంట ప్రతి వేడుకను గోవాలోనే జరుపుకుంటూ ఉంటారు. వీరిద్దరి పెళ్లి కూడా గోవాలోనే జరిగింది. ఆ తరవాత తొలి పెళ్లిరోజును కూడా గోవాలోనే జరుపుకున్నారు. ఇప్పుడు నాగచైతన్య పుట్టిరోజునూ అక్కడే జరుపుకుంటున్నారు. గతంలో గోవాలో ఏ వేడుక జరుపుకున్నా సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అందుకే ఇప్పుడు నాగచైతన్య బర్త్‌డే ఫొటోల కోసం అక్కినేని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, పెళ్లి తరవాత నాగచైతన్య, సమంత కలిసి నటిస్తోన్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ‘మజిలి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇటీవల విశాఖపట్నంలో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. మధ్యలో నాగచైతన్య బర్త్‌డే రావడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. చైతూ, సామ్ గోవా నుంచి తిరిగి వచ్చిన వెంటనే మళ్లీ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ బ్యానర్‌లో రెండో ప్రొడక్షన్ ఇది.
నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా, గతంలో ‘ఏమాయ చేసావే’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ చిత్రాల్లో కలిసి నటించిన చైతూ, సామ్‌కు పెళ్లి తరవాత సినిమా కావడంతో ‘మజిలి’పై అంచనాలు భారీగా ఉన్నాయి.
Tags:Summember celebrations in Goa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *