Natyam ad

మళ్లీ వేసవి..!తీవ్రమైన వేడిమితో ఎండలు”

-రోడ్లుమీదకు వెళ్లేందుకు భయపడుతున్న ప్రజలు
-ఎండుతున్న పంట పొలాలు
-మెట్ట భూములు, శివారు భూముల రైతుల ఆందోళన

పత్తికొండ ముచ్చట్లు:

 


వేసవి కాలం మళ్లీ వచ్చేసినట్లుగా ప్రజలు భావించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  గత నాలుగైదు రోజులుగా వేసవిలో కూడా కనిపించని వేడిమితో ఎండలు కాస్తుండటంతో ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకుభయపడుతున్నారు. గత మూడు రోజులుగా పత్తికొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుండటంతో ప్రజలు తీవ్రమైన ఎండలు భరించలేక అనేక అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో కొంతమేరకుచల్లదనంతో వాతావరణం ఉండాల్సిన పరిస్థితులు పోయి తీవ్రమైన వేడిమితో ఎండలు కాస్తుండటంతో ప్రజలు ఈ వాతావరణ మార్పులు ఇలా ఎందుకు వస్తున్నాయో అని ఆందోళన చెందుతున్నారు.వర్షాకాలంలో సాధారణంగా వచ్చే వైరల్ జ్వరాలుతో పాటుగా ఇప్పుడు తీవ్రమైన ఎండలకు చర్మవ్యాధులు, పేత, వంటిపై కురుపులు వంటివి వస్తున్నాయి. దీంతో ఆసుపత్రులకు ఇటువంటి వ్యాధులతోవస్తున్న వారి సంఖ్యకూడా పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత కనిపిస్తోంది. ఉదయం 10 గంటలు దాటిన తరువాత రోడ్లపై నడిచివెళ్లేందుకు పాదచారులు, వాహనాలపై వెళ్లే వారుఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, కార్లు ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లు తీవ్రమైన ఎండల గాలులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో

 

 

Post Midle

రైతాంగానికి ఖరీఫు కావలసిన వర్షాలు కురవకపోవడంతో మెట్టభూముల రైతులు, వంశధార, నాగావళి  భూములకు సాగునీరు అందకపోవడంతో పంటభూములు ఎండిపోతుండటంతో తీవ్ర ఆందోళనచెందుతున్నారు. ఇప్పటికే వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్న భూములను చూస్తున్న రైతులు కంటనీరు పెడుతున్నారు. పత్తికొండలో దాదాపు వేల ఎకరాలలో పంటభూములు ఎండిపోతుండటంతోరైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు కలుగుతున్నాయి.  భూములు ఎండిపోకుండా చూసుకునేందుకు కొందరు రైతులు టాంకర్లతో భూములు తడుపుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవారం రోజుల్లో అయినా వర్షాలు లేకపోతే పత్తికొండలో ఖరీఫ్ రైతులు వేలాది ఎకరాలలో పంటలు ఎండిపోయే ప్రమాదం కూడా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

Tags:Summer again..! Sun with intense heat”

Post Midle