పుంగనూరులో వేసవి చల్లకుండలు సిద్దం
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ ప్రాంత ప్రజలు వేసవిలో మట్టికుండల్లో మంచినీటిని నిల్వ చేసుకుని సేవిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ప్రీజ్‌లు, కూలర్లు ఉన్న వారు సైతం మట్టి కుండల్లో నీటిని నిల్వ చేసుకుని తాగడం జరుగుతుంది. ఇలా ఉండగా పట్టణంలోని కుమ్మరవీధిలో సుమారు 10 కుటుంబాల వారు కుండలు విక్రయించి జీవనం చేస్తున్నారు. వేసవి ప్రారంభంకావడంతో ఇంటినిండా కుండలు తయారు చేసి సిద్దం చేసుకున్నారు. ఒకొక్క కుండ రూ.50 నుంచి 100 వరకు విక్రయించనున్నారు. అలాగే మార్చి 14, 15 న శ్రీసుగుటూరు గంగమ్మజాతరలో అమ్మవారి వెహోక్కులు చెల్లించుకునేందుకు ప్రజలు మట్టికుండల్లో గెరిగెలు తీసుకుని మొక్కులు చెల్లిస్తారు. ఇందులో భాగంగా కుండలు వ్యాపారులు సిద్దం చేశారు.

Tags; Summer coolers are ready in Punganur
