సమ్మర్ స్టోరేజీ నీటి నిల్వ ఉన్న ట్యాంకును పరిశీలించిన సిపిఐ బృందం
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల పట్టణంలోని చెరువు కట్ట దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో ఉన్న నీటిమట్టాన్ని పరిశీలించడం జరిగింది. అని సిపిఐ పట్టణ ప్రధాన కార్యదర్శి కె ప్రసాద్ ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు
సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ షరీఫ్ భాష సిపిఐ మహానంది మండల కార్యదర్శి ఆర్ సామెల్ సిపిఐ సలీం నగర్ శాఖ కార్యదర్శి భూమని శ్రీనివాసులు బైటిపేట సిపిఐ శాఖ సహాయ కార్యదర్శి
నాగరాజు తెలిపారు.అనంతరం పై నాయకులు మాట్లాడుతూ, నంద్యాల పట్టణ ప్రజలు ఈ వేసవి కాలం మంచినీటికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని అన్నారు. ఎందుకంటే వేసవి కాలం మొదలు
కాకమునుపే మంచి నీటిని విలువచేసే సమ్మర్ స్టోరేజ్ లో ఇప్పటికే రెండు అడుగుల మేరకు నీటి మట్టం తగ్గడం జరిగింది. అక్కడ ఉన్న మంచి నీటి నిల్వలు పట్టణ ప్రజలకు ఏ మాత్రం సరిపోవు అని
అన్నారు.వీలైనంత త్వరగా వెలుగోడు నుండి తీసుకు వస్తున్నా పైపులైను త్వరగా పూర్తిచేసి అధికారులు పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని అన్నారు.మరోవైపు ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో
నీటి మట్టం తగ్గింది. ప్రతి సంవత్సరము అధికారుల ముందుచూపు లేని వల్ల పట్టణ ప్రజలు మంచినీటికి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.ఇప్పటికైనా అధికారులు నీటి నిల్వలు పెంచి పట్టణ ప్రజలకు
మంచినీటి కొరత లేకుండా చూడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి గా తెలియజేయడం జరుగుతుంది.
Tags: Summer storage CPI team inspecting water storage tank