సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు, ఆర్టీసి బస్టాండుకు మహర్ధశ

Summer Storages Tank and RTC Bust

– మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభానికి సిద్దం

Date:19/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి మంత్రి పెద్దిరెడ్డి శ్రీకారం చుట్టారు. సుమారు పది సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోని సమ్మర్‌స్టోర్‌జ్‌ ట్యాంకు, ఆర్టీసి డిపోను త్వరలో ప్రారంభించి, ప్రజలకు అంకితం చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృతనిశ్చయంతో అడుగులు వేస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇంజనీరింగ్‌ , ఆర్టీసి అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించి, ఇందుకు అవసరమైన మోటార్లు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు 2010లో పనులు ప్రారంభించి సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకును నిర్మించారు. సుమారు రూ.33.33 కోట్లతో పనులను శరవేగంగా పూర్తి చేశారు. పెద్దిరెడ్డి చేసిన అపర భగీరథయత్నం పనులను మాజీ ముఖ్యమంత్రులు ఆపివేశారు. దీనిపై ఆగ్రహంతో పెద్దిరెడ్డి పుంగనూరు నుంచి గార్గెయప్రాజెక్టు వరకు వేలాది మంది ప్రజలతో 77 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి పనులను కొనసాగించాలని హెచ్చరించారు. కాని ప్రారంభించకపోవడంతో పట్టణ ప్రజలకు దాహార్తి సమస్య తీరకపోయింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ట్యాంకులు, పంపుహౌసులు ,, స్టోరేజ్‌ట్యాంకు, పైపులైన్లు నిరుపయోగమైంది. దీనిపై వైఎస్సార్సీపి అధికారంలోకి రావడంతో మంత్రి పెద్దిరెడ్డి వీటిపై దృష్టి సారించి, ప్రారంభించేందుకు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇంజనీరింగ్‌ , ఆర్టీసి అధికారులు పుంగనూరులో పర్యటించి పనులను పరిశీలించారు.

ఆర్టీసి డిపో ……

పుంగనూరు నియోజకవర్గ ప్రజల కోసం రూ. 2 కోట్లతో నిర్మించిన ఆర్టీసి డిపో త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు డిపోను త్వరలో ప్రారంభించనున్నారు. పుంగనూరులో ఆర్టీసి డిపో ఏర్పాటు చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి మంజూరు చేశారు. 2009లో ఆర్టీసి డిపో పనులను మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేశారు. రాజకీయ మార్పులతో మాజీ సీఎంలు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు పుంగనూరులో అభివృద్ధి పనులు జరగకుండ పది సంవత్సరాల పాటు ఆపివేశారు. వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ విషయమై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్పందనకు తగ్గిన వినతులు

Tags: Summer Storages Tank and RTC Bust

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *