Summer watercolor to Punganur

పుంగనూరుకు వేసవిలో జలకళ

Date:23/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

హంద్రీనీవా కాలువ నీటిని పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువుకు వదలడంతో చెరువులో నీరు చేరి , కళకళలాడుతోంది. సుమారు 12 సంవత్సరాలుగా వర్షాలు లేక చెరువుకు నీరు చేరలేదు. ఇలా ఉండగా గత వారం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఈ మోహన్‌, కమిషనర్‌ కెఎల్‌.వర్మ నీటిని సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు పూజలు చేసి నీటిని విడుదల చేశారు. ఒక వైపు సమ్మర్‌స్టోరే జ్‌ ట్యాంకుకు నీరు చేరుతుండగా మరోవైపు పుంగమ్మ చెరువుకు కూడ నీరు చేరడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువు క్రింద సాగు చేస్తున్న రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా బోరు బావుల్లో నీరు పుష్కలంగా లభించి , వేసవిలో మంచినీటి సమస్య తీరిపోతుందని ఆశ బావం వ్యక్తం చేస్తున్నారు.

సుగాలిమిట్ట పెద్దతాండలో సమస్యల తిష్ట

Tags: Summer watercolor to Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *