Natyam ad

నేడు సూర్య నమస్కారముల పోటీలు

తిరుపతి ముచ్చట్లు:
 
యోగా అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్’ మరియు ‘తిరుపతి నగరపాలక సంస్థ’ సంయుక్త ఆధ్వర్యంలో నేడు సూర్య నమస్కారముల పోటీలు నిర్వహించడం జరిగిందని యోగా అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి యస్. శ్రీనివాసులు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను తిరుపతి లోని ప్రకాశం పార్క్ యందు ఉదయం గం.6-30 ని. ప్రారంభమైనది. ఈ పోటీలలో సుమారు 100 మంది యోగ సాధకులు పాల్గొన్నారు. 12 యోగా సనాల విన్యాసాలతో కూడిన సూర్యనమస్కారములను 400 సార్లు చేసిన మొదటి 6 (ఆరు) మందిని విజేతలుగా ప్రకటించడం జరిగింది. వీరిలోమొదటి బహుమతి : బి. పవన్ కుమార్ ,రెండవ బహుమతి : యం. మౌనిక రాణి ,మూడవ బహుమతి : జె. ఈశ్వర్ ప్రతాప్ ,నాల్గవ బహుమతి : బి. నిఖిత,ఐదవ బహుమతి : వి. ప్రవీణ్, ఆరవ బహుమతి : యం. వరుణ్ లు కైవసం చేసుకున్నారు.వీరికి 08-02-2022 రధసప్తమి రోజున ప్రకాశం పార్క్ లో జరిగే సామూహిక సూర్య నమస్కారల అనంతరం మేయర్ డాక్టర్ ఆర్. శిరీష గారి చేతులమీదుగా బహుమతులు ప్రధానం జరుగుతుంది.ఈ పోటీల కార్యక్రమాన్ని అసోసియేషన్ కార్యదర్శి యస్. శ్రీనివాసులు నాయుడు పర్యవేక్షిం చగా యస్. కల్పలత, కుమార్ రాజు, జి. కిరణ్ కుమార్ లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

Tags: Sun salutation competitions today