టీ 20 ఫార్మేట్ లో రెగ్యులర్ ప్లేయర్ గా సుందర్

Sunder as a regular player in T20 format

Sunder as a regular player in T20 format

Date:04/12/2019

బెంగళూరు ముచ్చట్లు:

టీ20 ఫార్మాట్‌లో రెగ్యులర్ ప్లేయర్‌గా మారిపోయాడు వాషింగ్టన్ సుందర్. జట్టులో తొలుత బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ తమిళనాడు ప్లేయర్ ప్రస్తుతం పూర్తిస్థాయి స్పిన్నర్‌గా జట్టులో కుదురుకున్నాడు. మరోవైపు గతకొంతకాలంగా పవర్ ప్లే ఆరంభ ఓవర్లలో స్పిన్ బౌలింగ్ చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. 1992 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ మార్టిన్ క్రో తెచ్చిన సంప్రదాయాన్ని భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొనసాగించాడు. గతంలో రవిచంద్రన్ అశ్విన్‌ను ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌ల సందర్భంగా ఓపెనింగ్ బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం ఈ పనిని సుందర్ కొనసాగిస్తున్నాడు. అయితే పవర్ ప్లేలలో బౌలింగ్ చేయడం చాలా కష్టసాధ్యమైన విషయమని పేర్కొన్నాడు.
సరైన ప్రదేశాల్లో బంతుల్ని వేస్తేనే వేస్తేనే ఫలితం ఉంటుంది. ఈక్రమంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. దీంతో మూల్యం చెల్లించక తప్పదు. అయితే ఇలాంటి చాలెంజ్‌లను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. పవర్ ప్లేలలో కుడి, ఎడమ చేతివాటం ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం సవాలుతో కూడుకున్నదే. అయితే గత రెండు, మూడేళ్లుగా నాకు లభించిన ఈ కొత్త పాత్రను ఆస్వాదిస్తున్నా’ అని సుందర్ వ్యాఖ్యానించాడు.మరోవైపు టీ20 వరల్డ్‌కప్ గురించి ఆలోచించడం లేదని సుందర్ అన్నాడు. ప్రస్తుత విషయాలపైనే తన దృష్టంతా ఉందని, వరల్డ్‌కప్ గురించి అంతగా ఆలోచించడం లేదని తెలిపాడు. అయితే ప్రపంచకప్‌లో ఆడడం ఎవరికైన కల అని, అయితే ప్రస్తుతం తాను వర్థమాన విషయాలపైనే ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో సుందర్ ఆడనున్నాడు. హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ అనంతరం తిరువనంతపురం, ముంబైలలో మిగతా రెండు టీ20లు జరుగుతాయి.

 

నేను… నా దేశమంటున్న నిత్యానంద

 

Tags:Sunder as a regular player in T20 format

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *