ఎనికేపాడులో సునీల్ ధియోధర్

విజయవాడ  ముచ్చట్లు :
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ ధియోదర్ సోమవారం ప్రారంభించారు. పార్టీ నేతలతో కలిసి అయన మొక్కలు నాటారు. తొలుత స్థానికంగా పలువురు నేతలను అయన పరామర్శించారు. గన్నవరం నియోజకవర్గ పార్టీ కేడర్ ను  ధియోదర్ ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో భాజపా బలోపేతానికి కృషి చేద్దామని అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధికి భాజపా కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కుమారస్వామి, ఫణి, మోహన్, రవి, మహిళా నేతలు పాల్గోన్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Sunil Deodhar in Enikepadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *