Natyam ad

సునీల్.. లాంగ్ లీవ్….?

విజయవాడ ముచ్చట్లు:

పీ సీఐడీ మాజీ చీఫ్ డాక్టర్ సునీల్ కుమార్ లాంగ్ లీవ్ లో వెళ్లారు. ఏపీ డీజీపీగా సునీల్ కుమార్ నియామకం జరగనుందన్న వార్తలు వస్తున్న సమయంలో ఆయన హఠాత్తుగా లాంగ్ లీవ్ లో వెళ్లడం సంచలనం కలిగిస్తోంది.  నిజానికి డాక్టర్ సునీల్ కుమార్ ఐపీఎస్ ఏపీలో ఎవరికీ పరిచయం అవసరం లేని పేరు. సీఐడీ చీఫ్ గా అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించిన వ్యక్తి.  విపక్ష నేతలపై ఇష్టారీతిగా కేసులు బనాయించి, అరెస్టులతో వేధించి విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి. సీఐడీ చీఫ్ గా ఉన్నంత కాలం సునీల్ కుమార్ అంటే ఏపీ సీఐడీ అన్నట్లుగా పరిస్థితి ఉండేది.  అటువంటి సునీల్ కుమార్ ను  ఏపీ ప్రభుత్వం హఠాత్తుగా ఇటీవల బదలీ చేసింది.   డీజీ హోదాలో ఉన్న ఆయనకు మరో పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా  జీఏడీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. సునీల్ కుమార్ స్థానంలో  ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సంజయ్ కుమార్  నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.   జగన్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి సీఐడీ చీఫ్ గా సునీల్ కుమారే ఉన్నారు.  ఆయన హయాంలో ఏపీ సీఐడీ ఒక  ప్రైవేటు సైన్యంలా, విపక్ష నేతలను వేధించడం కోసమే  ఉందా అన్నట్లుగా వ్యవహరించిందన్న ఆరోపణలను ఎదుర్కొంది.

 

 

రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడమే ఏపీ సీఐడి పనిగా పెట్టుకుందని, అందుకోసమే  పని చేస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.స్వయంగా సీఐడీ చీఫ్   సునీల్ కుమార్ పై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి.    ఆయన పని తీరును మెచ్చి జగన్ సర్కార్ సునీల్ కుమార్ కు డీజీగా పదోన్నతి ఇచ్చింది. పదోన్నతి ఇచ్చి నిండా నెలరోజులు కూడా కాకుండానే  బదలీ వేటు వేయడం సంచలనం సృష్టించింది. అంతే కాదు డీజీ స్థాయిలో ఉన్న ఆయనకు  పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించడం అప్పడే  సంచలనం సృష్టించింది.  1995లో పులివెందుల ఏఎస్పీగా తన కెరీర్ ను ప్రారంభించిన సునీల్, జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత ఏడీజీ హోదాలో సీఐడీ చీఫ్ గా ఉన్నారు. ఏపీ సర్కార్  జనవరి 1న ఆయనకు డీజీ ర్యాంకు ప్రమోట్ చేసింది . వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, మ్యాన్ హ్యాండలింగ్,  ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ నివాసంపై సీఐడీ పోలీసుల దాడి వంటి ఘటనలన్నీ ఈయన హయాంలోనే జరిగాయి. జర్నలిస్టు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం కూడా సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్న సమయంలోనే జరిగింది.  ఏపీ సీఐడీ చీఫ్ గా సునీల్ ఉన్న కాలంలో ఆ దర్యాప్తు సంస్థ డీల్ చేసిన కేసులన్నీ వివాదాస్పదమైనవే.

 

 

Post Midle

విపక్ష నేతలనే కాదు.. సామాన్యులను  సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న నెపంతో వేధించారన్న ఆరోపణలు సైతం ఆయనపై ఉన్నాయి. అయితే సునీల్ కుమార్ కు ప్రభుత్వం నుంచి పూర్తిగా దన్ను, ప్రోత్సాహం ఉండటంతోనే అలా వ్యవహరించారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు.అలాంటి సునీల్ కుమార్ కు హఠాత్తుగా ఏపీ సీఐడీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా  జీఏడీలో రిపోర్టు చేయమనడం వెనుక ఏం జరిగి ఉంటుందా అన్న అనుమానాలు వెల్లువెత్తాయి.  అయితే ఆయనను ఏపీ డీజీపీగా నియమించేందుకే సీఐడీ చీఫ్ పోస్టు నుంచి తప్పించారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.  అటువంటిది సీఐడీ పోస్టు నుంచి ఆయన తప్పించి ఇంత కాలం ఎలాంటి పోస్టూ ఇవ్వకుండా ప్రభుత్వం దూరం పెట్టడం, ఆ తరువాత ఇప్పుడు ఆయన హఠాత్తుగా లాంగ్ లీవ్ పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ప్రకాశం జిల్లాలోని ఒక రెస్టారెంట్, విశాఖ జిల్లాలో ఓ 50 ఎకరాల భూమి విషయంలో సునీల్ కుమార్ తన పరిధి దాటి వ్యవహరించడంతోనే ప్రభుత్వం ఆయనను పక్కన పెట్టేసింది. ఏది ఏమైనా.. సునీల్ కుమార్ ను సీఐడీ చీఫ్ పోస్టు నుంచి తప్పించి పక్కన  పెట్టేయడం, ఇప్పుడు ఆయన లాంగ్ లీవ్ పెట్టడం వెనుక ఏదో  పెద్ద కారణమే ఉందని మాత్రం అంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వానికి సానుకూలంగా.. పరిధి దాటి మరీ వ్యవహరించిన సునీల్ కుమార్ ఇప్పుడు అదే ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారనీ, అందుకే లాంగ్ లీవ్ పై వెళ్లక తప్పని అనివార్య పరిస్థితి ఎదుర్కొన్నారని అంటున్నారు.

 

Tags: Sunil.. long leave….?

Post Midle