సన్నీలియోన్.. ప్రపంచంలో పరిచయం అవసరం లేనిపేరు ఈమెది

Sunny Leone .. This is a name that does not require introduction in the world

Sunny Leone .. This is a name that does not require introduction in the world

Date:12/06/2019

హైదరాబాదు ముచ్చట్లు:

సన్నీలియోన్.. ప్రపంచంలో పరిచయం అవసరం లేనిపేరు ఈమెది. ఆ పేరు వింటే ఆమె అభిమానుల ఊహలు రెక్కలు తొడిగి ఎక్కడెక్కడో విహరిస్తుంటాయి. చలిగాలులు కూడా సైడైపోయి వేడిక్కిస్తాయి. రసిక ప్రియులకు ఆమె ఓ శృంగార దేవత. ఎంతమంది శృంగార నటీమణులు ఉన్నా.. కీబోర్డ్ అండ్ టచ్ స్క్రీన్స్‌పై సన్నీ అనే పేరే రిపీట్‌గా టైప్ అయిపోతుంది. అందుకే టాప్ ట్రెండింగ్‌లో సన్నీ పేరు ఉండాల్సిందే. పోర్న్‌స్టార్‌గా ప్రపంచస్థాయి ఖ్యాతి గడించిన ఈమె పోర్న్ రంగానికి దూరంగా ఉండి దశాబ్ధం కావొస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మెరుస్తోంది. ఇటీవల రాజశేఖర్ నటించిన గరుడవేగ చిత్రంలోని ఆమె ఐటమ్ సుందరిగా మెరిసిన ‘డియో డియో డిసక డిసక’ సాంగ్ 72 మిలియన్ వ్యూస్‌ని కొల్లగొట్టిందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఈ హాట్ సుందరితో కలిసి కామెడీ పండించబోతున్నారట కమెడియన్ సునీల్. కెరియర్ స్టార్టింగ్‌లో కమెడియన్‌గా సత్తా చాటిన సునీల్.. హీరోగా మారి డీలా పడ్డారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ‘అరవింద సమేత’, ‘చిత్రలహరి’ చిత్రాల్లో మెప్పించి వరుస అవకాశాలను అందుకుంటున్నారు. అయితే సన్నీ లియోన్‌ బాలీవుడ్ మూవీలో సునీల్‌ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది. తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ‘కోకాకోలా’ అనే హిందీ హారర్ కామెడీ చిత్రంలో సునీల్ నటించబోతున్నాడట. మహేంద్ర దరివాల్, పరమదీప్‌ సాందు నిర్మాతలుగా ప్రసాద్‌ తాటికేని దర్శకత్వంలో వస్తోన్న హారర్ కామెడీ చిత్రంలో సునీల్‌తో పాటు బ్రహ్మానందం కూడా నటించబోతున్నారట. సన్నీ లియోన్‌తో కలిసి ‘డియో డియో డిసక డిసక’ అనేందుకు ముంబైకి వెళ్లబోతున్నారంట సునీల్ అండ్ బ్రహ్మీ. మొత్తానికి సునీల్ తన బాలీవుడ్ డెబ్యూ మూవీతో సన్నీ‌ పక్కన ఛాన్స్ కొట్టేశారన్నమాట. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

నీట్ 2019 షెడ్యూల్ విడుదల

Tags:Sunny Leone .. This is a name that does not require introduction in the world

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *