Natyam ad

దిష్టి తగలకుండా సన్నీలియోన్ ఫోటోలు

వరంగల్ ముచ్చట్లు:

తన పంట పొలానికి దిష్టి తగాలకుండా ఉండేందుకు ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ, హీరోయిన్ సన్నీలియోన్‌ బికినీ వేసుకొని ఉన్న ఫొటోను పంట పొలంలో పెట్టాడు. వంరగల్ కు చెందిన ఓ రైతు తమ పంటకు దిష్టి తగలకుండా ఉండాలని… బికినీ వేసుకుని ఉన్న సన్నీ లియోన్‌ ఫొటోను వెదురు కర్ర సహాయంతో పెట్టాడు. దీంతో దారి వెంట పోయేవాళ్ల కళ్లన్నీ ఆ బికినీ బొమ్మపై మాత్రమే ఉండి ఇతరుల దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో రైతు వినూత్న ఆలోచన తన మిరుప తోటకు దిష్టి తగలకుండా సన్నీ లియోన్ ఫ్లెక్సీనీ ఏర్పాటు చేశాడు. ఎల్లంపేట గ్రామానికి చెందిన రైతు కొమురయ్య తనకు ఉన్న ఎకరం భూమిలో మిరుప తోట సాగు చేయగా.. గత ఏడాది  పంటకు దిష్టి తగిలి పెట్టుబడులు కూడా రాలేదు అని చెప్పాడు. అందుకే ఈసారి రోడ్డు పక్కన ఉన్న తన పంట పొలంపై రోడ్డు మార్గం గుండా వెళ్లే వారి చూపు తోటపై పడికుండా ఉంటుందని భావించి సన్నీ లియోన్ ఫ్లెక్సీనీ తోటలో ఏర్పాటు చేశాడు. దీంతో ఇతరుల చూపు ఫ్లెక్సీపై పడి తోట మెరుగు పడుతుంది అని రైతు కొమురయ్య అంటున్నాడు. దీంతో రైతు ఆలోచనకు పరిసర ప్రాంత రైతులు ఔరా అంటున్నారు.

 

Tags: Sunny Leone’s photos without flash

Post Midle
Post Midle