‘పించ్’ వెబ్‌షోలో సన్నీలియోన్ ఆవేదన

Sunnylawn's worry in 'Pinch' webshow
Date:23/04/2019
ముంబై ముచ్చట్లు:
పోర్న్ జీవితాన్ని వదిలి బాలీవుడ్‌లో స్థిరపడిన సన్నీ లియోన్ తన గతాన్ని మరిచిపోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా నెటిజన్స్ మాత్రం ఆమెను వదిలి పెట్టడం లేదు. ప్రతి విషయాన్ని గతంతో ముడిపెట్టి ట్రోల్ చేస్తూ ఆమెను విసిగిస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్‌ ఖాన్ ప్రారంభించిన ‘పించ్’ వెబ్‌షోలో ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ షోకు సంబంధించిన ప్రివ్యూ వీడియోలో సన్నీ మాట్లాడుతూ.. తన గతం గురించి మాట్లాడింది. పోర్న్ వీడియోల్లో నటించడం, బాలీవుడ్‌లో ఎంట్రీ వంటి అంశాలపై సన్నీ స్పందించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులు, ట్రోలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానం ఇచ్చింది. ఈ ప్రివ్యూ వీడియోను అర్భాజ్‌ఖాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఎస్ ఫర్ స్ట్రాంగ్.. ఎస్ ఫర్ సన్నీలియోన్’ అంటూ ఆమెను ఆకాశాన్ని ఎత్తాడు. సోషల్ మీడియాలో ట్రోలర్స్‌ను ఆమె ఎలా ఎదుర్కొంటోంది. దీనిపై సన్నీ ఏం చెప్పిందో చూడండి అంటూ అర్భాజ్ ఊరించాడు. సన్నిలియోన్ పోర్న్ చిత్రాలను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నవారిపై స్పందిస్తూ.. ‘‘నన్ను ట్రోల్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు నా పేజ్‌లో ఎంతసేపు గడుపుతారో నాకు తెలుసు’’ అని సన్ని పేర్కొంది. సన్నీలియోని. అర్బాజ్ ఖాన్, సన్నీలియోన్ ‘తేరా ఇంతిజార్’ సినిమాలో కలిసి నటించారు.
Tags:Sunnylawn’s worry in ‘Pinch’ webshow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *