క్యాన్సర్ కు సూర్యుడి మందు

the-fiery-sunrise-5

the-fiery-sunrise-5

Date:12/06/2019

లండన్ ముచ్చట్లు:

క్యాన్సర్ వ్యాధిని గుర్తించడం ఎంత కష్టమో నివారణ కూడా అంతే కష్టం. అయితే, సూర్యరశ్మి ద్వారా క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయొచ్చట. అంతేకాదు.. 13 శాతం క్యాన్సర్ మరణాలను సైతం

జయించవచ్చని పరిశోధకులు తాజా అధ్యయనంలో వెల్లడించారు. ‘క్యాన్సర్’పై ఇటీవల జరిగిన ప్రపంచస్థాయి సదస్సులో ప్రజలు సూర్మరశ్మిలో గడపడం మంచిదేనని వెల్లడించారు. సూర్యరశ్మి

నుంచి విడుదలయ్యే ‘విటమిన్ డి’కి క్యాన్సర్ నివారించే శక్తి ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగేళ్ల వ్యవధిలో 80వేల మందిపై నిర్వహించిన పరిశోధనల

వివరాలను వెల్లడించారు. క్యాన్సర్ వల్ల చనిపోతారని భావించిన పలువురి పరీక్షించగా ‘విటమిన్ డి’ వల్ల మరణించే అవకాశాలు 13 శాతానికి తగ్గినట్లు మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ

పరిశోధకులు తెలిపినట్లు ‘ద సన్’ వెబ్‌సైట్ కథనం పేర్కొంది. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ తారెక్ హేకల్ చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ అంకాలజీ వార్షిక

సదస్సులో మాట్లాడుతూ.. ‘‘ఇకపై క్యాన్సర్ వైద్య నిపుణులు తమ ప్రిస్కిప్షన్‌లో ‘విటమిన్-డి’ను తప్పకుండా రాయాలి. దీనివల్ల రోగులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది.

సూర్యరశ్మిలోగానీ, విటమిన్-డి ట్యాబ్లెట్ల ద్వారా గానీ వారు మరింత కాలం జీవించే అవకాశాలు ఉంటాయి’’ అని తెలిపారు. ఏదీ ఏమైనా సూర్మరశ్మి సాధారణ ప్రజలకు కూడా ఆరోగ్యకరమైనదే.

ముఖ్యంగా ఉదయాన్నే లేచి కాసేపు సూర్యరశ్మిలో నిలుచుంటే విటమిన్-డి లభించడమే కాదు.. ఇతరాత్ర అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.

 

 

ఇండిగో సమ్మర్ సేల్ 999

Tags:Sun’s medicine to cancer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *