వడదెబ్బకు ఉపాధికూలీ మృతి

Date:29/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

Sunstroke deaths
Sunstroke deaths

ఉపాధి పనులు చేస్తున్న అంధుడైన కూలీ వడదెబ్బకు మృతి చెందిన సంఘటన పుంగనూరు మండలం బుర్రావారిపల్లెలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన లింగప్ప కుమారుడు రెడ్డెప్ప (42) అంధత్వం కలవాడు. అతని భార్య మంజుల కూడ వైకల్యం కలిగి ఉంది. ఇలా ఉండగా గ్రామ చెరువులో చేపలకుంట పనులకు కూలీగా భార్యభర్తలు ఇద్దరు వెళ్లారు. ఉపాధి పనులు చేస్తుండగా ఎండ తీవ్రతకు రెడ్డెప్ప అపస్మారక స్థితిలో పడిపోవడంతో వెంటనే గ్రామస్తులు ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు పుంగనూరుకు చేరుకున్నారు. అప్పటికే రెడ్డెప్ప మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం

 

Tags:Sunstroke deaths

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *