Natyam ad

అక్రమ సంబంధంతో భర్తను సుపారి హత్య చేయించిన భార్య

జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన


నల్గోండ ముచ్చట్లు:


అక్రమ సంబంధంతో ఒక భార్య కట్టుకున్నల భర్తనే సుపారి హత్య చేయించింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ మండలం తుంగపాడు లావుడి తండాకి చెందిన ధారవత్ రాగ్యకు పెద్దఊర మండలంకు చెందిన రోజాతో 2010లో వివాహం, ఇద్దరు పిల్లలు సంతానం. మూడేళ్లుగా హైదరాబాద్ లో నివాసం వుంటున్నారు.  అక్కడే వరుసకు బావ అయిన లక్ పతితో రోజాకు వివాహేతర సంబంధం ఏర్పడింది, విషయం  భర్తకు తెలియడంతో ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపధ్యంలో ప్రియుడు లక్ పతి, నల్గొండ జిల్లా నెరేడుగొమ్మ మండలంలోని బుగ్గతాండ కు చెందిన మాన్సింగ్, బాలాజీలకు 20 లక్షలతో సుపారి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆగస్టు 19న హైదరాబాద్ నగర శివారులో మద్యం తాగించి రాగ్యను హతమార్చారు. నెరేడుగొమ్మ మండలం కాసరాజపల్లి పుష్కరఘాట్ సమీపంలో కృష్ణా నదిలో రాగ్య మృతదేహాన్ని  సుపారి నిందితులు పడేసారు. రాగ్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన హైదరాబాద్ పోలీసులు, భార్య రోజాఫోన్ కాల్ డేటా ఆధారంగా హత్య మిష్టరీని ఛేదించారు. రాగ్య మృతదేహం కోసం రెండు రోజులుగా గజ ఈతగాళ్లతో కృష్ణా నదిలో వెతుకుతున్నారు.

 

Post Midle

Tags: Supari is the wife who killed her husband due to illicit relationship

Post Midle

Leave A Reply

Your email address will not be published.