గోపీచంద్ కెరీర్ లో హైయ్యస్ట్ గ్రాసర్ గా నిలబడి అన్ని ఏరియాల్లో సూపర్ కలెక్షన్స్

Super Collections in all areas standing as a hiestist in Gopichand's career

Super Collections in all areas standing as a hiestist in Gopichand's career

Date:13/07/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
గోపీచంద్ కెరీర్ లో హైయ్యస్ట్ గ్రాసర్ గా నిలబడి అన్ని ఏరియాల్లో సూపర్ కలెక్షన్స్ తో 2 వ వారంలో కి ఎంటర్ అయిన మా ‘పంతం’ చిత్రాన్ని అపూర్వంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి థాంక్స్- నిర్మాత కె కె రాధామోహన్ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `పంతం`. యాక్ష‌న్‌, క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ 25వ చిత్రం `పంతం`.  కె.చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ప్రెస్టీజియ‌స్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఓ వైపు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో పాటు.. మెసేజ్ ఉన్న పంతం సినిమా జూలై 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై గ్రాండ్ స‌క్సెస్ సాధించి విజ‌య‌వంతంగా రెండోవారంలోకి అడుగు పెట్టింది. ఈ సంద‌ర్భంగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత‌, చిత్ర నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ – “గోపీచంద్‌గారి కెరీర్‌లో ప్రెస్జీయస్ చిత్ర‌మైన 25వ సినిమాను నిర్మించే అవ‌కాశం మా బ్యాన‌ర్‌లో రావ‌డం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా గోపీచంద్‌గారికి ఎంత ముఖ్య‌మో నాకు అవ‌గాహ‌న ఉండ‌టంతో.. మేకింగ్ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. భారీ బ‌డ్జెట్‌తో సినిమాను అద్భుతంగా రూపొందించాం. మెసేజ్ ఓరియెంటెడ్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం చాలా క‌ష్టం.  ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి కొత్త‌వాడైనా చ‌క్క‌టి క్లారిటీతో `పంతం`లాంటి మెసేజ్ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. సినిమాలో గ్రాండ్‌నెస్‌కి ఆడియ‌న్స్ ని మెప్పించింది. అంతే కాకుండా సినిమాను మంచి మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించారు డైరెక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి. గోపీచంద్‌గారు ఈ సినిమా అవుట్‌పుట్ బాగా రావ‌డానికి ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. ఆయ‌న న‌ట‌న వ‌ల్లే సినిమాలో మెసేజ్‌కు ఆడియెన్స్ క‌నెక్ట్ అయ్యారు. అలాగే క్లైమాక్స్‌లో కోర్టు సీన్‌.. అందులో ఎమోష‌న‌ల్‌గా గోపీచంద్‌గారు చెప్పిన డైలాగ్స్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. గోపీగారు.. రెండు షేడ్స్‌లో వేరియేష‌న్‌ను చూపుతూ.. క్యారెక్ట‌ర్స్‌ను బ్యాలెన్స్ చేసిన విధానం సూప‌ర్బ్ . చ‌క్ర‌వ‌ర్తి టేకింగ్‌కి ప్ర‌సాద్ మూరెళ్ల‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ తోడైంది. అలాగే  గోపీ సుంద‌ర్‌గారి సంగీతం.. నేప‌థ్య సంగీతం.. ప్రవీణ్ పూడిగారి ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాలు స‌మిష్టి కృషి ఈ సినిమా తిరుగులేని విజయానికి కార‌ణ‌మై మా `పంతం` సినిమా గోపీచంద్‌గారి కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. అలాగే అన్ని ఏరియాల్లో సూపర్ కలెక్షన్స్‌తో విజ‌య‌వంత‌గా రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా మా సినిమా స‌క్సెస్‌లో కార‌ణ‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు.. తిరుగులేని విజయాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌“ అన్నారు.
గోపీచంద్ కెరీర్ లో హైయ్యస్ట్ గ్రాసర్ గా నిలబడి అన్ని ఏరియాల్లో సూపర్ కలెక్షన్స్  https://www.telugumuchatlu.com/super-collections-in-all-areas-standing-as-a-hiestist-in-gopichands-career/
Tags:Super Collections in all areas standing as a hiestist in Gopichand’s career

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *