Natyam ad

ఏపీకి  సూపర్ సైక్లోన్ ముప్పు..

-భారీ వర్షాలు,  వరదలు వచ్చే అవకాశం

అమరావతి ముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం…ఏర్పడనుంది.ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం….ఏర్పడనుంది. అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ వైపు పయనం కానుంది. ఆ తర్వాత తుఫాన్ గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.తుఫాన్ ఏర్పడితే సిత్రంగ్ గా నామకరణం చేయనున్నారు. సూపర్ సైక్లోన్ అవకాశాలను గ్లోబల్ ఫో ర్ కాస్ట్ సిస్టమ్(జీ.ఎఫ్.ఎస్) గుర్తించింది. సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఏపీ, ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలపైన ప్రభావం ఉండనుందని గుర్తించారు.

 

Post Midle

Tags: Super cyclone threat to AP..

Post Midle