సూపర్ స్పైడర్ , స్ట్రీట్ వెండర్స్ వ్యాక్సినేషన్ ని సద్వినియోగం చేసుకోవాలి -మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి

జగిత్యాల  ముచ్చట్లు :

 

సూపర్ స్పైడర్ , స్ట్రీట్ వెండర్స్ వ్యాక్సినేషన్ ని సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి సూచించారు. గురువారం పట్టణంలోని ఎస్ కే ఎన్ఆర్ జూనియర్ కాలేజీలో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నసూపర్ స్పైడర్, స్ట్రీట్ వెండర్స్ కి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ డా. బోగ శ్రావణి పరిశీలించారు.ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, సమాజానికి నిత్యవసర సేవలందిస్తూ హైరిస్క్ జోన్లలో పనిచేస్తున్న స్ట్రీట్ వెండర్స్ కు వ్యాక్సినేషన్ ఇచ్చు కార్యక్రమాన్ని జగిత్యాల పట్టణంలోని  ప్రభుత్వ ఎస్ కే ఎన్ఆర్ జూనియర్ కళాశాలలో అధికారులు, కౌన్సిలర్లతో కలిసి సందర్శించడం జరిగిందని తెలిపారు.వీధి వ్యాపారులు పురపాలక సంస్థ నుంచి తీసుకున్న లైసెన్సుల ఆధారంగా గుర్తిస్తామని వెల్లడించారు. పురపాలక సంఘం పరిధిలో దాదాపు 10 వేల మంది చిరు వ్యాపారం చేసుకునే వారికి కేవలం కూరగాయల వ్యాపారులే కాకుండా అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్న వారి వివరాలు సేకరిస్తు వారికి వ్యాక్సిన్ ఇప్పించడం జరుగుతుందని   తెలపారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు చుక్క నవీన్, జంబర్తి రాజ్ కుమార్, నాయకులు, సిరికొండ సింగరావ్, డిష్ జగన్, కూతురు శేఖర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర రెడ్డి, అశోక్, రాము, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Super Spider, Street Vendors Should Take advantage of Vaccination – Municipal Chairperson Bhoga Shravani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *