Natyam ad

వైసీపీలోకి సూపర్ స్టార్ ఎంట్రీ?

అమరావతి ముచ్చట్లు:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇప్పుడీ విషయం సినిమా సర్కిల్స్ హాట్ టాపిక్‌గా మారిందట.సినీ పరిశ్రమ తనకిచ్చిన స్టార్ డమ్‌తో ప్రజలకేదో చేయాలనే ఆలోచనలో ఉన్న మహేష్ బాబు, రాజకీయాల ద్వారా అయితే సమాజంలో మరింత మంచి చేయవచ్చని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులతోనూ చర్చించగా, గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.అంతే కాకుండా మహేష్ బాబు సొంత బాబాయి ఆదిశేషగిరిరావు వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.వైసీపీలోకి చేరేందుకు సిద్ధమైన మహేష్ బాబు అందుకు ముహూర్తాన్నీ నిర్ణయించుకున్నారట. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. అదే రోజున సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. అలాగే పార్లమెంటు ఎన్నికల్లోనా లేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా, ఎక్కడి నుంచి బరిలోకి దిగాలనేది సీఎం జగన్ సూచనల మేరకు నిర్ణయం తీసుకోనున్నారని సినీ, పొలిటికల్ సర్కిళ్లలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి.

 

Post Midle

Tags: Super star entry into YCP?

Post Midle