నిరుపయోగంగా నీటి శుద్ధి యంత్రాలు

Superfluous water purifiers

Superfluous water purifiers

Date:12/12/2019

రామసముద్రం ముచ్చట్లు:

ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన యంత్రాలు నిరుపయోగంగా మారాయి. వివిధ కారణాలతో నీటి శుద్ధి యంత్రాలు మూలన పడి తృప్పు పడుతున్నాయి. రామసముద్రం మండలం చెంబకురులో గత ఐదేళ్ల క్రితం ప్రశ్నప్రభుత్వం నీటి శుద్ధి యంత్రాలు మంజూరు చేసింది. వీటిని స్థానిక పంచాయతీ కార్యాలయం లోని ఒక గదిలో ఏర్పాటు చేశారు. అయితే అయిదేళ్లుగా వీటిని సక్రమంగా వినియోగించ పోవడంతో ప్రజలకు శుద్ధిజలాలు అందడం లేదు. దీంతో ప్రజలు అధిక ధరలు వెచ్చించి ప్రైవేట్ వ్యక్తుల నుంచి శుద్ధ జలాలను కొనుగోలు చేయాల్సిి వస్తోంది. నీటి శుద్ధి యంత్రాన్ని ఇలానే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో అవి పూర్తిగా వినియోగానికి ఉపయోగపడని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీవో లక్ష్మీపతి వివరణ కోరగా పంచాయతీ పరిధిలో తగిన నీటి వనరులు లేకపోవడంతో నీటి శుద్ధి యంత్రాన్ని వినియోగించుకోలేక పోతున్నట్లు వివరించారు. అదనపు బోర్లు ఏర్పాటు చేసి ప్రజలకు శుద్ధి నీటిని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.

 

సబ్సిడీపై ఎర్రగడ్డలు పంపిణీ

 

Tags:Superfluous water purifiers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *