పంచె కట్టుతో కనువిందు చేస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌ 

Superstar Mahesh is doing well with Pancha bucket

Superstar Mahesh is doing well with Pancha bucket

Date:19/03/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రంలో మహేష్‌ ట్రెడిషనల్‌ లుక్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. సర్‌ప్రైజింగ్‌గా మహేష్‌ మొదటిసారి పంచె కట్టుతో కనిపించడం సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వ్యూస్‌ సాధించింది.
మార్చి 25 నుంచి స్పెయిన్‌ షెడ్యూల్‌ ఈ సందర్బంగా స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ ”మన తెలుగు సంవత్సరాది పండగ కళ ఉట్టిపడే పంచె కట్టుతో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశాం. ప్రేక్షకులకు, అభిమానులకు మహేష్‌ కొత్త లుక్‌ కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఓ పాట రాజు సుందరం నేతృత్వంలో చిత్రీకరణ జరుగుతోంది. భారీ టెంపుల్‌ సెట్‌లో 100 డాన్సర్లు, 1000 మందికి పైగా జూనియర్‌ ఆర్టిస్టులతో చాలా గ్రాండ్‌ లెవల్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నార. ఈనెల 25 నుంచి స్పెయిన్‌లో షెడ్యూల్‌ ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా ‘భరత్‌ అనే నేను’ చిత్రాన్ని విడుదల చేస్తాం” అన్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌ల తోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.
Tags: Superstar Mahesh is doing well with Pancha bucket

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *