ఉల్లిగడ్డల మాటున గుట్కాలు సరఫరా

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లా పాణ్యం మండలం పరిధిలో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా, కంభంకు చెందిన షేక్ నాయబ్, మేడం శ్రీను అను ఇద్దరు వ్యక్తులు కర్ణాటక జిల్లా రాయచూరు నుంచి తర్ఫిలెన్ టాటా వాహనంలో ఉల్లిగడ్డల లోడుతో పాణ్యం మీదుగా వెళ్తుండగా జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. వాహనం కిందిభాగంలో నాలుగు లేయర్లు గుట్కా ప్యాకెట్స్ సంచులను గుర్తించారు. పైభాగంలో ఉల్లిగడ్డలను లోడ్ చేసి కంభంకు తరలిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు. పట్టుబడిన గుట్కా ప్యాకెట్లు విలువ 3.50 లక్షల వరకు ఉంటుందని పాణ్యంసి ఐ వెల్లడించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Supply of cups for onions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *