సతాయిస్తున్న సర్వర్!

Supplying server!

Supplying server!

Date:11/07/2018
చిత్తూరు ముచ్చట్లు:
సర్వే రికార్డులు డిజిటలైజేషన్‌ చేసేందుకు తిరుపతిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ఏపిసాక్‌)లో సర్వర్‌ డౌన్‌ అయింది. దీంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సర్వే రికార్డులు డిజిటలైజేషన్‌ చేసేందుకు ‘కీ’ ఇచ్చేందుకు సర్వేయర్లు రోజులు తరబడి ఎపి సాక్‌ సెంటర్‌ చుట్టూ తిరగాల్సిన దుస్థితి తలెత్తిందని సమాచారం. సమస్య పరిష్కారం ఆలస్యమవుతుండడంతో సర్వేయర్లు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. మండల స్థాయిలో భూసర్వే రికార్డులను డిజిటలైజేషన్‌ చేసేందుకు తిరుపతి, మదనపల్లె, చిత్తూరు పట్టణాలలో ఎపిసాక్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిద్వారా దాదాపు 3.42లక్షల రికార్డులును డిజిటలైజేషన్‌ చేయాల్సి ఉంది. తిరుపతి పరిధిలో 1.11లక్షల రికార్డులకు గాను 93వేల రికార్డులను పూర్తి చేశారు. రికార్డులు పూర్తి అయినా వాటిని సరిచూసి, నిర్ధారించి సర్వేయర్లు ఎపిసాక్‌ సెంటర్‌లో డిజిటల్‌ కీ ద్వారా ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంది. అయితే 66మంది మండల సర్వేయర్లకు 36 మంది మాత్రమే కీతో పని చేశారు. కీ ఇవ్వని 30మంది సర్వేయర్లకు కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న సర్వేయర్లు ఎపి సాక్‌ సెంటర్‌కు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.జిల్లాలోని వివిధ మండలాల నుంచి కీ తో రికార్డులను డిజిటలైజేషన్‌ చేసేందుకు ఎపిసాక్‌ సెంటర్‌కు వస్తున్న సర్వేయర్లకు సర్వర్‌ అష్టకష్టాలు పెడుతోందన్న విమర్శలున్నాయి. గాలులకు దెబ్బతిన్న యాంటెనాతో సర్వర్‌ సరిగా పనిచేయడం లేదని పలువురు అంటున్నారు. దీంతో ప్రతి రోజు పదుల సంఖ్యలో సర్వేయర్లు తిరుపతికివచ్చి వెనుదిరుగుతున్నారని వాపోతున్నారు. కీ పనిచేయకపోవడం వలన వందలాది సర్వే రికార్డులు వాయిదా పడుతున్నాయి. పట్టించుకోవాల్సిన సర్వేశాఖాధికారులు పత్తా లేకుండా పోతున్నారని సర్వేయర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సకాలంలో సర్వర్‌ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఇదిలాఉంటే తిరుపతి ఎపిసాక్‌ సెంటర్‌లో గాలుల వల్ల సర్వర్‌ దెబ్బతిందని సమాచారం. మరమ్మతు చేయాలని స్వాన్‌ సిబ్బందిని కోరినట్లు సంబంధిత విభాగానికి చెందినవారు చెప్తున్నారు. మరమ్మతులు చేసేవారు రావడం ఆలస్యం అయిందని ఈ సమస్యను పరిష్కరిస్తామని అంటున్నారు. ఏదేమైనా సర్వర్ల సమస్యను సత్వరమే పరిష్కరించి డిజిటలైజేషన్ కార్యక్రమం సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
సతాయిస్తున్న సర్వర్! https://www.telugumuchatlu.com/supplying-server/
Tags:Supplying server!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *