Support corona sufferers

కరోనా వ్యాధి గ్రస్తులను ఆదరించండి

– ప్రభుత్వ సేవలు బేష్‌
– కరోనాను జయించిన దంపతుల మనోగతం

Date:11/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఊహించని విధంగా భార్యభర్తలు ఇద్దరు కరోనా భారీన పడ్డారు. కానీ మనోధైర్యం వదలకుండ భర్త తిరుపతి పద్మావతి కోవిడ్‌లో చికిత్సలు పొందగా, భార్య ఇంటిలోనే ఉంటు చికిత్సలు తీసుకుని కరోనాను జయించి తమ అభిప్రాయాలను విలేకరులకు వెల్లడించారు. పుంగనూరు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ షమీమ్‌షరీఫ్‌, ఆమె భర్త మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌కు 15 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో షరీఫ్‌ తిరుపతి కోవిడ్‌ ఆసుపత్రికి వెళ్లారు. కానీ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మాత్రం మనోధైర్యంతో ఆసుపత్రికి వెళ్లకుండ ఇంటిలోనే ఉంటు ప్రభుత్వ వైద్యం తీసుకుని, పట్టణ ప్రజలు ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా షమీమ్‌షరీఫ్‌ మాట్లాడుతూ 15 రోజులుగా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు , వైద్య సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. కరోనా వ్యాధి సోకిందరని ఎవరు ఆదైర్యపడకుండ మనోధైర్యంతో ఉండాలన్నారు. అలాగే కరోనా సోకినవారి పట్ల చిన్నచూపు చూడరాదని పిలుపునిచ్చారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరులో చేపడుతున్న పలు కార్యక్రమాలు రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిలుస్తోందని కొనియాడారు. షరీఫ్‌ మాట్లాడుతూ కోవిడ్‌ ఆసుపత్రిలో వైద్యంతో పాటు భోజనం, సేవలు బేష్‌గా ఉందన్నారు. కరోనాను జయించిన దంపతులను పలువురు కలసి అభినందించారు.

కరోనా రోగి అంత్యక్రియల్లో పాల్గోన్న మంత్రి 

Tags: Support corona sufferers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *