Natyam ad

జగనన్న మహిళలకు ఆసరా- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మహిళలందరు తమంతకు తాముగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలకు భరోసా కల్పించారని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. శుక్రవారం మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ చేయూత క్రింద నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మంత్రి పెద్దిరెడ్డి, ఇన్‌చార్జ్ కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌, టీటీడీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్‌, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, డీసీసీబి చైర్మన్‌ రెడ్డెమ్మ హాజరైయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2,396 మంది మహిళలకు రూ.4.49 కోట్ల రూపాయల చేయూత చెక్కును పంపిణీ చేశారు. అలాగే రూ.11.79 కోట్లు బ్యాంకు లింకేజ్‌ చెక్కును పంపిణీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామిలను 98 శాతం అమలు చేయడం జరిగిందన్నారు. మహిళలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, భీమా, సున్నావడ్డీ, బ్యాంకులింకేజ్‌తో పాటు అమ్మ ఒడి, ఫీజురియంబర్స్మెంట్‌ల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటిలో 955 సంఘాలను రూ.152.44 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. అలాగే నవరత్నాలను కులమతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందించడం జరిగిందన్నారు. రెండువేల మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యాబై ఇండ్లకొక వలంటీర్‌ను నియమించి, అర్హులను గుర్తించి పథకాలు అందించడం జరుగుతోందన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌, పీడీ రాధమ్మ, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, ఫృద్వీదర్‌రెడ్డి పాల్గొన్నారు.

Post Midle

కంపెనీలతో ఒప్పందం…

మహిళలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకుందన్నారు. అమూల్‌, హిందుస్థాన్‌, యూనిలీవర్‌, రిలయన్స్, జీయో బిజినెస్‌ లాంటి కంపెనీల సహకారంతో వివిధ రకాల వస్తువులను కొనుగోలు, విక్రయాలు నిర్వహించేందుకు వీలుందన్నారు. 45 నుంచి 60 సంవత్సరాల లోపు గల ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు చేయూత ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలు తమకు నచ్చిన రంగాలను ఎంచుకుని ప్రభుత్వం అందిస్తున్న డబ్బును వ్యాపారాలకు ఖర్చు చేసి అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.

పుంగనూరు అభివృద్ధి…

పుంగనూరు అభివృద్దికి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సహకారం మరువలేనిదని మంత్రి పెద్దిరెడ్డి కొనియాడారు. ఒకే కుటుంబం 30 ఏళ్లు పాలించినా అభివృద్ధి జరగలేదన్నారు. మూడేళ్ళలో సమ్మర్‌స్టోరేజ్‌ట్యాంకు, ఆర్టీసి డిపో, బైపాస్‌రోడ్లు, నాడు-నేడు పథకంతో ఆసుపత్రులు, పాఠశాలల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు, రైతులకు సాగునీరు అందించేందుకు హంద్రీనీవా కాలువ నీటిని నిల్వ చేసి మూడు రిజర్వాయర్లను నిర్మించడం జరుగుతోందన్నారు.

జిల్లాలో రూ.188 కోట్లు జమ …

జిల్లాలో వైఎస్సార్‌ చేయూత పథకం క్రింద రూ.188 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారని ఇన్‌చార్జ్ కలెక్టర్‌ డాక్టర్‌ వెంకట్వేర్‌ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.18,750లను కిరణాషాపులు, పాడిపరిశ్రమ లాంటివి ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు. జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని కొనియాడారు.

జగనన్న కొండంత అండ…

నాకు ముగ్గరు పిల్లలు , భర్త చనిపోయాడు కానీ జగనన్న నాకు కొండంత అండగా నిలిచారు. వితంతు పెన్షన్‌, అమ్మ ఒడి, విద్యా దీవెన, చేయూత తో పాటు సొంత ఇల్లు నిర్మించి ఇచ్చారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నాకు అన్ని పథకాలు అందాయి. మా కుటుంభానికి భరోసా లభించింది. జగనన్న దైర్యంతో ముందుకెళ్తాం.

– కౌసల్య, లబ్ధిదారు. పుంగనూరు.

 

Tags: Support for Jagananna Women – Minister Dr. Peddireddy

Post Midle