అత్యున్నత వైద్య విజ్ఞాన సంస్థగా ‘స్విమ్స్‌’కు తోడ్పాటు

సమీక్షలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

Date:04/12/2019

అమరావతి ముచ్చట్లు:

దేశంలోనే అత్యున్నత వైద్య విజ్ఞాన సంస్థగా తీర్చిదిద్దేందుకు టీటీడీ నుంచి సంపూర్ణ సహకారమందిస్తామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు. బుధవారం సాయంత్రం వెలగపూడిలోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో కలిసి స్విమ్స్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈసందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాజధాని ప్రాంతానికి త్వరలో ఎయిమ్స్‌ రాబోతోంది. ఉత్తరాంధ్రలో కింగ్‌జార్జి ఆస్పత్రి సేవలందిస్తున్నట్లే రాయలసీమ ప్రజలకు స్విమ్స్ తలమానికంగా నిలిచిందన్నారు. కార్డియాలజీతోపాటు గ్యాస్త్రో ఎంట్రాలజీకి సంబంధించిన అత్యాధునిక పరికరాల కొనుగోలుపై చర్చించారు. ఉద్యోగుల పదోన్నతులు, ఆర్థిక సౌకర్యాల పెంపు గురించి సమీక్షించారు. స్విమ్స్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. సమావేశంలో తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి కేఎస్‌ జవహర్‌, తిరుపతి జేఈఓ బసంత్‌ కుమార్‌, స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలసిన కృష్ణమూర్తి

 

Tags:Support for ‘Swims’ as top medical science company

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *