మున్సిపల్‌ ఓటర్ల సర్వేకు సహకరించండి

– కమిషనర్‌ మదుసూదన్‌రెడ్డి

Date:20/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి ఎన్నికల నిమిత్తం పట్టణంలోని 24 వార్డుల్లోను ఎస్సీ, ఎస్టీ , బీసీ, మహిళా ఓటర్ల గణన కార్యక్రమం ప్రారంభించినట్లు కమిషనర్‌ మదుసూదన్‌రెడ్డి సోమవారం తెలిపారు. ప్రభుత్వాదేశాల మేరకు పురపాలక సిబ్బంది మంగళవారం నుంచి అందరి ఇండ్లకు వెళ్లి గణన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. దీని ద్వారా తుదిజాబితాను తయారు చేసి, ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. దీని మేరకు ఓటర్ల జాబితాను సిద్దం చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్ల వివరాలతో రిజర్వేషన్ల పక్రియ జరుగుతుందన్నారు. వీటిపై ఫిర్యాదులను, క్లెములను స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలందరు మున్సిపల్‌ సిబ్బందికి సహకరించి, గణన కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వంతో సమానంగా కరువు భృతి చెల్లించాలి

 

Tags: Support Municipal Voters Survey

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *