నేతన్నలకు అండగా 

Date:29/06/2020

గద్వాల  ముచ్చట్లు:

గద్వాల పట్టణంలో ఏర్పాటు చేసిన నేతన్నకు చేయూత పథకం ముగింపు ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు . ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఎల్లప్పుడూ ఉంటుందని వారు పడే కష్టాలు, ఇబ్బందులలో ఆదుకోవడంలో ముందుంటుందని ఆ భాగంగానే నేతన్నకు చేయూత పథకం ముగింపు 36 నెలలు ఉండగా కరోనా మహమ్మారి వల్ల చేనేత కార్మికులు నేసిన చీరలు మార్కెటింగ్ లేక  కూలీలు పొందక నేత కార్మికులు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నేత కార్మికులు కష్టాలు చూడలేక వారు వేసిన చీరలకు మార్కెటింగ్ లేక వారికి కష్టాలు పడే సమయంలో మన చేనేత మంత్రి కేటీఆర్ నేత కార్మికులను ఆదుకుంటామని హామీ  ఇచ్చారు. చేనేతకు చేయూత పథకం మూడు నెలల ముందుగానే రద్దు పరచి  కార్మికులు బ్యాంకులో జమ చేసే  దానికంటే రెండంతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేసి కార్మికులకు అందించే ఏర్పాటు చేశారు.

 

 

 

చేనేతకు సంబంధించిన జోగులాంబ గద్వాల జిల్లా అధికారి ద్వారా గద్వాల ఎమ్మెల్యే చేతులమీదుగా ఆంధ్ర బ్యాంకు. కెనరా బ్యాంక్. సంగమేశ్వర బ్యాంక్ మేనేజర్ లకు గద్వాల ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. చేనేత కార్మికులు కట్టే ఆర్ డి ..1.  ఆర్ డి ..2. ఖాతాలలో రెట్టింపు అమౌంట్ జమ చేసి కార్మికులకు. అందజేస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా మొత్తం 3739 దాకా చేనేత కార్మికులు లబ్ది పొందుతున్నారు.  గద్వాల నియోజకవర్గంలో 1529 మంది చేనేత కార్మికులు, అలంపూర్ నియోజకవర్గంలో 2210 మంది చేనేత చేనేత కార్మికులు చేనేతకు చేయూత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరోసారి ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో  గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్,  వివిధ మండలాల్లో ఎంపీపీలు, గద్వాల వివిధ వార్డుల కౌన్సిలర్, చేనేత కార్మిక సంఘం నాయకులు అక్కల శాంతారావు,  మంత్రి సురేష్, సంఘ మహావీర్,  కొంకటి ఆంజనేయులు, మాస్టర్ వీవర్స్ తదితరులు పాల్గొన్నారు.

లారీ ఓనర్ల అందోళన

Tags:Support the weavers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *