పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండవ సారి ఏర్పాటైయ్యేందుకు న్యాయవాదులు సహకరించి , రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసేలా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయవాదులను కోరారు. ఆదివారం నూతన న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు ఆకుల చెన్నకేశవులతో పాటు అధిక సంఖ్యలో న్యాయవాదులు వెళ్లి మంత్రి పెద్దిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నకేశవులను మంత్రి పెద్దిరెడ్డి సన్మానించారు. ఈమేరకు నూతన అధ్యక్షుడు చెన్నకేశవులు మంత్రికి వినతిపత్రం అందజేసి , న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు కాగానే న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఏపీపీ హరినాథరెడ్డి, ఏజిపి భాస్కర్‌రెడ్డి తో పాటు సీనియర్ న్యాయవాదులు మల్లికార్జునరెడ్డి, కెవి.ఆనందకుమార్, షమీవుల్లా, రాఘవేంద్ర, విజయ్‌కృష్ణ, వెంకట్రమణారెడ్డి, జహుర్‌బాషా, రెడ్డెప్ప తదుతరులు ఉన్నారు.
Tags: Support YSRCP- Minister Peddireddy asked for lawyers