హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు

Supreme Court orders on division of High Court

Supreme Court orders on division of High Court

Date:05/11/2018

న్యూఢిల్లీ ముచ్చట్లు:

తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై సర్వోన్నత న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం డిసెంబర్ 15 నాటికి పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు కోర్టు తెలిపింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై హైకోర్టు న్యాయమూర్తులు కూడా సంతృప్తి చెందారని, జనవరి 1న కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు  పేర్కొంది. అతిత్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైకోర్టు కార్యకలాపాలు కొనసాగిస్తాయని అత్యున్నత న్యాయస్థానం ఆశాభావం వ్యక్తం చేసింది.అమరావతిలో జస్టిస్ సిటీ నిర్మాణం కొనసాగుతున్నందున జడ్జిల నివాసం అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి సూచించింది. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక హైకోర్టు విభజన పూర్తిస్థాయిలో జరుగుతుందని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

వానలు లేకపోయిన రైతుకు భరోస

Tags:Supreme Court orders on division of High Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *