రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా సీబీఐ దర్యాప్తుకు సుప్రీంనో

Date:19/11/2020

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:

సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల విషయం లో  సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాష్ట్రాలలోని ప్రభుత్వాలను నేతలను కంట్రోల్ లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చాలా జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. అందుకే చాలా బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలు సీబీఐని ఆయా రాష్ట్రాల్లో నిషేధించాయి. ఇప్పటికే దేశంలో రాజస్థాన్ బెంగాల్ మహారాష్ట్ర కేరళ సహా 8 రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని రద్దు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా సీబీఐ తన దర్యాప్తు పరిధిని విస్తరించజాలదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా చట్టం ఉందని న్యాయమూర్తులు వివరించారు. కేంద్రం ఈ దర్యాప్తు సంస్థ పరిధిని విస్తరించకూడదని కోర్టు పేర్కొంది.యూపీలో జరిగిన అవినీతి కేసులో నిందితులైన అధికారులు దాఖలు చేసిన పిటీషన్ ను పురస్కరించుకొని న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్ గవాయ్ లతో కూడిన బెంచ్ ఈ సందర్భంగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ చట్టాన్ని ప్రస్తావించింది.

పుష్కరఘాట్ల నిధులు  నిల్

Tags: Supreme Court to probe CBI without state government permission

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *