మోరల్ పోలీసింగ్ పై సుప్రీంకోర్టు తీర్పు

Supreme Court verdict on Moral Policing

Supreme Court verdict on Moral Policing

Date:17/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పశువధ అంశం పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టీస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గోవధ ముసుగులో జరుగుతున్న దాడులను ఖండించింది. పశువధ పేరుతో వ్యక్తులపై జరుగుతున్న దాడులను నిరోధిస్తూ  పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ప్రజాస్వామ్యంలో మోరల్ పోలిసింగ్కు చోటు లేదని, చట్టాలను ప్రజలు చేతుల్లోకి తీసుకోవద్దని పేర్కొంది. శాంతిభద్రతలను కాపాడే బాధ్యత రాష్ట్రాలదేనని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు జారీ చేసింది. మోరల్ పోలిసింగ్ అరికట్టేందుకు కొత్త చట్టాలు అవసరమని పేర్కొంది. ఈ అంశం పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో 4 వారాలలోపు తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కు ఆదేశాలు జారీ చేసింది.  రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు స్పందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్ట్ 28 కి వాయిదా వేసింది.
మోరల్ పోలీసింగ్ పై సుప్రీంకోర్టు తీర్పుhttps://www.telugumuchatlu.com/supreme-court-verdict-on-moral-policing/
Tags: Supreme Court verdict on Moral Policing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *