అలోక్ వర్మ న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court writes against Alok Varma's attorney

Supreme Court writes against Alok Varma's attorney

‘స్పందన లీకైంది..ఇక విచారణ ఎందుకు?
Date:20/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ప్రాథమిక దర్యాప్తు నివేదికపై సీల్డ్‌ కవర్‌లోని స్పందన మీడియాకు ముందే లీక్‌ అవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. సీల్డ్‌ కవర్‌లో ఉన్న వివరాలు బయటకు ఎలా పొక్కాయంటూ ధర్మాసనం ప్రశ్నించింది.‘ప్రతి ఒక్క అధికారికి రక్షణ ఉండాలని మేం ప్రయత్నిస్తుంటాం. అందుకే కేసుల్లో గోప్యత ఉండాలని అడుగుతుంటాం. కానీ నేడు సీల్డ్‌ కవర్‌లో అలోక్‌ వర్మ ఇచ్చిన స్పందన మీడియాకు ముందే లీక్ అయ్యింది. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సిన అవసరం ఉందని మేం భావించట్లేదు’ అని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలోక్ వర్మ న్యాయవాది ఫాలి ఎస్‌ నారిమన్‌పై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించిన పత్రాలను లాయర్‌ నారిమన్‌కు ఇస్తూ.. ‘మీరు సీనియర్‌ న్యాయవాది.
అందుకే ఈ పత్రాలను మీకు ఇస్తున్నాం. వీటిపై స్పందించేందుకు మీకు సమయం కావాలంటే తీసుకోండి. ఆలోగా మేం వేరే కేసులు విచారిస్తాం’ అని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ అన్నారు. వాటిని చూసిన లాయర్‌ నారిమన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవి ఎలా లీక్ అయ్యాయో తమకు తెలియదని, దీనికి బాధ్యులైన వ్యక్తులకు సమన్లు జారీ చేయాలని నారిమన్‌ కోర్టును కోరారు. అనంతరం ఈ కేసు విచారణను నవంబరు 29కి వాయిదా వేశారు.సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అలోక్‌ వర్మపై విచారణ జరిపిన సీవీసీ ప్రాథమిక నివేదికను నవంబరు 12న సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో సమర్పించింది. ఆలోక్‌వర్మపై వచ్చిన కొన్ని అభియోగాలపై మరింత దర్యాప్తు చేపట్టాల్సి ఉందని, దీనికి కొంత గడువు అవసరమని సీవీసీ తెలిపింది. ఈ నివేదికపై స్పందించాలని కోర్టు ఆలోక్‌వర్మను ఆదేశించింది. ఈ మేరకు అలోక్‌ వర్మ తన స్పందనను సోమవారం సీల్డ్‌ కవర్‌లో సమర్పించారు. అయితే అంతకంటే ముందే అలోక్ వర్మ సమాధానం ఇదేనంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tags:Supreme Court writes against Alok Varma’s attorney

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *