నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు  మండిపాటు

న్యూఢిల్లీ  ముచ్చట్లు:


మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఉదయ్‌పూర్‌ ఘటనకు నుపూర్‌ కామెంట్స్‌ కారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు… మీడియా ద్వారా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. నుపుర్‌శర్మ వ్యాఖ్యలు ఆమె అహంకారాన్ని తెలియచేస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.లాయర్‌ అని నుపుర్‌ శర్మ చెప్పుకోవడం సిగ్గుచేటని సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించింది. స్వయంగా లాయర్‌ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. టీవీ డిబేట్‌లో నుపుర్‌శర్మ చేసిన వ్యాఖ్యలు తాను చూశానని , యాంకర్‌ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినప్పుడు కేసు ఎందుకు పెట్టలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రశ్నించారు.నుపుర్‌శర్మపై దేశవ్యాప్తంగా కేసులు నమోదైనప్పటికి ఎందుకు అరెస్ట్‌ చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనప్పటికి ఢిల్లీ పోలీసులు కనీసం ఆమెను ప్రశ్నించలేకపోయారని మండిపడిందితను చేసిన వ్యాఖ్యలపై నుపుర్ శర్మ మీడియా ముఖంగా దేశానికి క్షమాపణలు చెప్పాలని, సదరు టీవీ యాజమాన్యం కూడా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.

 

 

 

దేశవ్యాప్తంగా భావోద్వేగాలు రగిలించిన తీరుపై ఆమె ఒంటరిగా బాధ్యత వహించాలని పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఆమె లాయర్ అని చెప్పుకోవడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆమె ఫిర్యాదు చేసిన వ్యక్తి అరెస్ట్ అయినా.. ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు నుపుర్ శర్మను టచ్ చేయలేదని విమర్శించింది. ఇలాంటి చర్చలు పెట్టే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నుపుర్ శర్మ డిబెట్ ను మేం పూర్తిగా చూశామని సుప్రీం కోర్ట్ వెల్లడించింది.ఆమె తరుపున వాదించిన మణిందర్ సింగ్ సుప్రీం కోర్టుకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. కోర్టు మాత్రం వాటిని పట్టించుకోలేదు. ఓ పార్టీకి అధికార ప్రతినిధి అయిన నుపుర్ శర్మకు గర్వం, అధికారం తలకెక్కాయని వ్యాఖ్యానించింది. ఇటువంటి వాళ్లు చీప్ పబ్లిసిటీ ఎజెండాగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని వ్యాఖ్యానించింది. నీ వల్లే ఉదయ్ పూర్ ఘటన జరిగిందంటూ సుప్రీం కోర్ట్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీ చర్చ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇచ్చారని నుపుర్ శర్మ లాయర్ కోర్టుకు తెలిపారు. దీనికి ప్రతిగా ‘‘ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంటుంది.. ప్రజాస్వామ్యంలో గడ్డి పెరిగే హక్కు ఉంది, గాడిదకు తినే హక్కు ఉంది’’ అని న్యాయమూర్తి ఘాటుగా బదులిచ్చారు. నుపుర్ శర్మపై దాఖలైన అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేసేందుకు  సుప్రీం కోర్ట్ నిరాకరించింది.

 

Tags: Supreme Court’s verdict on Nupursharma

Leave A Reply

Your email address will not be published.